Drugs Case: ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌ తీర్పును రిజర్వ్‌లో పెట్టిన కోర్టు

Aryan Khan Cries During video Call With Shah Rukh Khan And Gouri Khan - Sakshi

డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ తనయుడి బెయిల్‌ విచారణ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఆర్యన్‌కు ముంబై కోర్టు మూడుసార్లు బెయిల్‌ నిరాకరించగా, ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆర్యన్‌కు తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కల్పించింది ముంబై కోర్టు. ఈ నేపథ్యంలో ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్‌తో ఆర్యన్‌ మాట్లాడాడు.

చదవండి: ఆర్యన్‌ టార్గెట్‌ అవ్వడానికి కారణం షారుకే : నటుడు

గత 10 రోజులుగా జైలులో ఉంటున్న ఆర్యన్‌ తల్లిదండ్రులను చూడగానే కన్నీటి పర్యంతరమయ్యాడట. అయితే జైలులో ఉన్న ప్రతి వ్యక్తి.. వారానికి రెండు సార్లు కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్యన్‌కు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఇచ్చారు. కాగా డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై రెండు రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన సెషన్స్‌ కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. అక్టోబర్‌ 20వ తేదీ వరకు జడ్జీ పటిషన్‌ తీర్పును రిజర్వ్‌లో పెట్టారు.

చదవండి: జాకీ చాన్‌ అలా చేశాడంటూ.. షారుక్‌ని టార్గెట్‌ చేసిన ఫైర్‌ బ్రాండ్‌

దీంతో ఆర్యన్‌ మరో ఐదు రోజుల పాటు ఆర్ధర్‌ రోడ్‌ జైలులోనే ఉండాల్సి వచ్చింది. అతని బెయిల్‌ పిటిషన్‌పై వరుసగా రెండో రోజు కూడా ముంబై సెషన్స్ కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌ను మరోసారి వ్యతిరేకించారు ఎన్సీబీ తరపు న్యాయవాది. అయితే ఎన్పీబీ ఆరోపణలను ఆర్యన్‌ తరపు న్యాయవాదులు కొట్టిపారేశారు. సెలబ్రిటీల పిల్లలైన్నంత మాత్రాన బెయిల్ ఇవ్వరాదని చట్టంలో ఎక్కడ లేదంటూ ఆయన వాదించారు. కాగా అక్టోబర్‌ 2వ తేదీన అర్థరాత్రి ముంబైలోని క్రూయిజ్‌ ఓడరేవు డ్రగ్స్‌ పార్టీలో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ తనిఖిలో ఆర్యన్‌తో పాటు మరో 8మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top