మృత్యువుతో పోరాడుతున్న హీరోయిన్.. కనీసం ఫోన్ కూడా చేయలేదు! | Arundhathi Battles For Life, Family Claims No One Helps From Tamil Film Industry | Sakshi
Sakshi News home page

Arundhathi: చావు, బతుకుల మధ్య హీరోయిన్.. సాయానికి ముందుకురాని ఇండస్ట్రీ!

Mar 20 2024 3:19 PM | Updated on Mar 20 2024 4:12 PM

Arundhathi Battles For Life, Family Claims No One Helps From Tamil Film Industry - Sakshi

హీరోయిన్‌ అరుంధతి నాయర్‌ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన ఆమెను తిరువనంతపురంలోని ఆస్పత్రిలో చేర్పించగా ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఓ ఇంటర్వ్కకు హాజరైన ఆమె అనంతరం తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అరుంధతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక సాయం కోసం నటి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని మరో నటి గోపిక అనిల్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించింది.  ఈ మేరకు బ్యాంకు వివరాలను సైతం పొందు పరిచింది.

అయితే ఇప్పటివరకు తమిళ ఇండస్ట్రీ సభ్యుల నుంచి ఎలాంటి సాయం అందలేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె సన్నిహితురాలు, బుల్లితెర నటి రెమ్యా జోసెఫ్ వెల్లడించారు. ఇంతవరకు వారి కుటుంబ సభ్యులను నడిగర్ సంఘం సభ్యులు కూడా సంప్రదించలేదని తెలిపింది. కనీసం ఫోన్‌ చేసి కూడా ఎవరూ ఆరా తీయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాము ఆర్థిక సాయం కోరితే చాలామంది ట్రోల్ చేశారని ‍అరుంధతి సోదరి ఆరతి వెల్లడించింది. ఇప్పటికే వైద్యానికి దాదాపు రూ.5 లక్షల ఖర్చు అయిందని పేర్కొంది. ప్రస్తుతం బ్రెయిన్ సర్జరీకి డాక్టర్లు సిద్ధమవుతున్నారని ఆరతి తెలిపారు. 

సినీ కెరీర్‌..
కాగా 'పొంగి ఎలు మనోహర(2014)' సినిమాతో నటిగా వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టిందీ అరుంధతి. విరుమాండికుమ్‌ శివానందికమ్‌, సైతాన్‌, పిస్తా, ఆయిరం పోర్కాసుకల్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఒట్టకోరు కాముకన్‌ చిత్రంతో మలయాళ చిత్రసీమకు పరిచయమైంది. పద్మిని, డోంట్‌ థింక్‌ అనే వెబ్‌ సిరీస్‌ల్లోనూ యాక్ట్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement