AR Rahman's Son AR Ameen Escapes Major Accident On Set, Shares Pics - Sakshi
Sakshi News home page

Ar Rahman : సెట్‌లో ప్రమాదం.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ రెహమాన్‌ కొడుకు

Mar 6 2023 1:02 PM | Updated on Mar 6 2023 1:54 PM

Ar Rahman Son Ar Ameen Escaped Major Accident On Set Shares Pics - Sakshi

ప్రముఖ సంగీత దర్శకుడు,ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ కుమారుడు అమీన్‌కు భారీ ప్రమాదం తప్పింది. తమిళనాడులో జరిగిన ఓ ‍ప్రమాదంలో అమీన్‌ తృటిలో తప్పించుకున్నాడు. అయితే ఘటన జరిగి మూడు రోజులైనా ఇంకా ఆ షాక్‌ నుంచి కోలుకోలేపోతున్నట్లు ఆమీన్‌ తెలిపాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించాడు.

''నా టీంతో కలిసి ఓ మ్యూజిక్‌ వీడియో షూట్‌ చేస్తుండగా క్రేన్‌కు ఏర్పాటు చేసిన కొన్ని వస్తువులు.. భారీ లైట్లు కింద పడ్డాయి.ఈ ప్రమాదం జరిగిన సమయంలో నేను వాటికి కొద్ది దూరంలోనే ఉన్నాను. పైనుంచి కిందపడిన వాటిలో ఓ భారీ షాండిలియర్‌ కూడా ఉంది. ఏమాత్రం కాస్త అటుఇటు అయినా అవి మా తలపై పడేవి. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

ఈ ఘటనతో మా టీం అంతా షాక్‌కి గురయ్యాం. ఇప్పటికీ దాన్నుంచి తేరుకోలేకపోతున్నా. ఆ భగవంతుడు, తల్లిదండ్రులు, అభిమానుల ఆశీర్వాదం వల్లే ఆరోజు నేను ప్రమాదం నుంచి బయటపడగలిగాను. లేదంటే చాలా ఘోరం జరిగి ఉండేది'' అంటూ ఘటనకు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా షేర్‌చేశాడు అమీన్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement