అవును.. నేను ఆ సర్జరీ చేయించుకున్నాను: అనుష్క శర్మ

Anushka Sharma Said About Getting A Temporary Lip Enhancer - Sakshi

సంచలన విషయాలు వెల్లడించిన అనుష్క, ప్రియాంక

సినిమా తారలు అంటే చాలు అందానికి ప్రతిరూపాలు అన్నట్లు భావిస్తారు జనాలు. వారిని చూసి.. సమాజంలో చాలా మంది ఆడవాళ్లు తాము కూడా హీరోయిన్ల మాదిరి కనిపించడం కోసం తహతహలాడతారు. ఇందుకోసం పడరాని పాట్లు పడతారు. అయితే హీరోయిన్లు అందరూ పుట్టుకతోనే తీర్చిదిద్దిన శరీర సౌష్టవాన్ని కలిగి ఉంటారా అంటే కాదు. చాలా మంది తమను తాము మరింత అందంగా చూపించుకోవడం కోసం ప్రత్యేకంగా సర్జరీలు చేయించుకుంటారు. పాత తరం నుంచి నేటి వరకు ఉన్న హీరోయిన్లలో పలువురు అందాన్ని పెంచుకోవడం కోసం ​కాస్మోటిక్‌ సర్జరీలు చేయించుకున్నారు. అయితే చాలా మంది హీరోయిన్లు దీని గురించి బయటకు వెల్లడించారు. కానీ అనుష్క శర్మ, ప్రియాంక చోప్రాలు వంటి హీరోయిన్లు మాత్రం తాము ఇలాంటి సర్జరీలు చేయించుకున్నామని తెలిపారు.

 2016 వోగ్‌ ఇంటర్వ్యూలో అనుష్క ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా ఈ వీడియో మరోసారి వైరలవుతోంది. పెదాలు పెద్దగా కనిపించడం కోసం అనుష్క సర్జరీ చేయించుకున్నారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘ఇందులో దాచడానికి ఏం లేదు. బాంబే వెల్వేట్‌ సినిమాలో భాగంగా పెదాలు పెద్దగా కనిపించడం కోసం నేను సర్జరీ చేయించుకున్నాను. అయితే ఇది తాత్కలికమే. దీని గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అనిపించింది. అందుకే ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించాను’’ అన్నారు. కరణ్‌ జోహర్‌ కాఫీ విత్‌ కరణ్‌ 2014 ఎపిసోడ్‌లో అనుష్కని చూసిన వారు ఆమె కాస్మోటిక్‌ సర్జరీ చేయించుకుంది అంటూ విమర్శించారు.

 

మరోనటి ప్రియాంక చోప్రా తాను కూడా సర్జరీ చేయించుకున్నట్లు వెల్లడించారు. తన ఆటోబయోగ్రఫి అన్‌ఫినిష్డ్‌లో ప్రియాంక ఈ విషయాన్ని వెల్లడించారు. 20వ ఏట ఉండగా తన నాసికా కుహరంలో 'పాలిప్' ను కనుగొన్నట్లు తెలిపారు. శస్త్రచికిత్స ద్వారా దాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నారు. కానీ సర్జరీలో తప్పు జరగడంతో తన ముక్కు స్వరూపమే మారిపోయిందని.. ఇక అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని తాను ఎంతో బాధపడినట్లు వెల్లడించారు ప్రియాంక. ఆ తరువాత దాన్ని సెట్‌ చేసుకోవడానికి మరో సర్జరీ చేయించుకున్నారు. ఇక ప్రియాంక కొత్త అవతారం చూసిన జనాలు ఆమెని ప్లాస్టిక్‌ ప్రియాంక అంటూ ట్రోల్‌ చేశారు.

ఇక అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే పలు సర్జరీలు చేయించుకున్నారు. సినిమాల్లోకి రాక ముందు జాన్వీ ఫోటోలు చూస్తే ఈ విషయం క్లియర్‌గా అర్థం అవుతుంది. ఇక కత్రినా కైఫ్‌, అయేషా టకియా, వాణీ కపూర్‌, శిల్పా శెట్టి, అదితిరావ్‌ హైదరీ వంటి పలువురు హీరోయిన్లు కూడా అందాన్ని పెంచుకోవడం కోసం సర్జరీలు చేయించుకున్నారనే వార్తలు విపిపిస్తాయి. వీరు మాత్రం వీటిపై ఇంతవరకు స్పందించలేదు. 

చదవండి: షాకింగ్‌: నటికి సర్జరీ మిస్‌ఫైర్‌ కావడంతో

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top