Anupama Parameswaran: Shares Post About Fake Calls And Message With Her Name Viral - Sakshi
Sakshi News home page

Anupama Parameswaran: మెసేజ్‌లు చేస్తూ డబ్బులు అడుగుతున్న అనుపమ!, హీరోయిన్‌ క్లారిటీ

Feb 1 2022 4:04 PM | Updated on Feb 1 2022 4:55 PM

Anupama Parameswaran Shares Post About Fake Calls And Message With Her Name - Sakshi

‘ప్రేమమ్‌’ మూవీతో సినీ పరిశ్రమకు పరిచయమైంది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌. చేసింది కొన్ని సినిమాలే అయినా అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. సినిమాల్లో డిసెంట్‌ రోల్స్‌ ఎంచుకుంటూ అందం, అభినయంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. ఎక్కువ సమయంలో సోషల్‌ మీడియాలో గడిపే అనుపమ తరచూ తన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు చేరువుగా ఉంటోంది. ఈ క్రమంలో విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. 

చదవండి: వరుణ్‌ తేజ్‌ గని మూవీకి 2 రిలీజ్‌ డేట్స్‌, ఎప్పుడైనా రావొచ్చు..

అలా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనుపమ కొన్నిసార్లు చేదు అనుభవాన్ని కూడా ఎదుర్కొంది. అంతేకాదు ఇటీవల ఆమె నటించిన రౌడీ బాయ్స్‌ చిత్రంలో రెచ్చిపోయి రొమాంటిక్‌, లిప్‌లాక్‌ సీన్స్‌ చేయడంతో ఫ్యాన్స్‌ నుంచి విమర్శలు కూడా ఎదుర్కొంది. ఈ క్రమంలో అనుపమకు మరో చేదు అనుభవం ఎదురైంది. కొందరూ తన పేరుతో ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఆమె పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఓ అమెరికా నెంబర్‌ నుంచి మెసెజ్‌లు చేస్తూ పలువురి దగ్గర డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారట, ఇప్పటికే కొందరూ ఈ నేరగాళ్ల బాధితుల జాబితాలో చేరినట్లు సమాచారం.

చదవండి: షాకింగ్‌: తండ్రితో పాటు అన్‌స్టాపబుల్‌ షోకు పని చేసిన బాలయ్య చిన్న కూతురు

ఇది కాస్తా తన దృష్టికి చేరడంతో తన ఫ్యాన్స్‌కు, నెటిజన్లకు అనుపమ సందేశం ఇస్తూ ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ షేర్‌ చేస్తూ నెటిజన్లను ఆమె అలర్ట్‌ చేసింది. ‘ఓ అమెరికన్ నెంబర్ షేర్ చేసి ఈ నెంబర్ నుంచి వచ్చే మెసేజ్‌లు కాని కాల్స్‌కు కాని నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ నెంబర్ నాది కాదు. ఈ నెంబర్ నాకు తెలిసిన వాళ్ళది కూడా కాదు. ఆ నెంబర్‌ను కొందరు నాది అని నమ్మి మోసపోయినట్లుగా నా దృష్టికి వచ్చింది. ఇలాంటి నెంబర్‌ల నుంచి నా పేరు చెప్పి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి.  ఈ నంబర్స్ నుంచి వచ్చే మెసేజెస్, కాల్స్‌కు స్పందించకండి’ అంటూ’ అనుపమ నెటిజన్లు అప్రమత్తం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement