రైల్వే ప్లాట్‌ఫామ్‌పై పడుకున్న రోజులూ ఉన్నాయి:‌ నటుడు

Anupam Kher Shares His personal Life In Hyderabad - Sakshi

నేను జీవితాన్ని ఆస్వాదిస్తాను

బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ఫిక్కీ ఫ్లో ఆర్గనైజేషన్‌ ‘ది పవర్‌ ఆఫ్‌ పాజిటివిటీ’ పేరుతో హోటల్‌ ఐటీసీ కాకతీయలో 2020–21 వార్షిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఇండియన్‌ లెజండరీ యాక్టర్, మోటివేషనల్‌ స్పీకర్, రచయిత, అనుపమ్‌ఖేర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మీడియాతో మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..  

కేరాఫ్‌ రైల్వే ప్లాట్‌ఫామ్‌..  
నగరంలో మంచి అనుభవాలు ఉన్నాయి. గతంలో తెలుగు సినిమా ‘త్రిమూర్తులు’లో నటించడానికి ఇక్కడికి వచ్చాను. నేను నటిస్తున్న మరో తెలుగు సినిమా కార్తికేయ– 2 త్వరలో షూటింగ్‌ ప్రారంభం కానుంది. 27 ఏళ్ల వయసులో సినిమాల కోసం వచ్చిన నేను మొదట్లో ముంబైలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ రైల్వే ప్లాట్‌ఫామ్‌పై పడుకున్న రోజులూ ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు మహేష్‌భట్‌ సినిమాలో అవకాశం వచ్చేంత వరకు ఎన్నో కష్టాలు పడ్డాను.  

ఇండియన్‌ సినిమా.. లార్జర్‌ దెన్‌ లైఫ్‌..  
నాకు తెలిసినంత వరకు భారతీయులు సినిమాని లార్జర్‌ దెన్‌ లైఫ్‌గా భావిస్తారు. అందుకే ఇండియాకి సినిమా అనేది లార్జర్‌ దెన్‌ లైఫ్‌గా మారింది. ఇక్కడి ఆర్టిస్టులు అన్ని కోణాల్లో నటించినట్టు విదేశీ నటులు నటించలేరు. మన దగ్గరా గొప్ప సినిమాలు వస్తున్నాయి. నేను లండన్‌లో బాహుబ లి సినిమాను చూశాను. ఇది ఒక తెలుగు సినిమాగా చూడను. భారతీయ సినిమాగానే చూస్తా ను. నా జీవితంలో బోర్, మూడ్‌ అనే పదాలకు దూరంగా ఉన్నాను.

ఎప్పుడూ జీవితాన్ని ఆస్వాదిస్తూ, విభిన్న రకాల మనుçషులని కలవడాన్ని ఇష్టపడతాను. ఇప్పటి వరకు మూడు పుస్తకాలు రాశాను. ముఖ్యంగా కోవిడ్‌ సమయంలో ‘యువర్‌ బెస్ట్‌ డే ఈస్‌ టుడే’ అనే బుక్‌ని రాశాను. ఈ సమయంలో అంతా విషాదం నిండి ఉంది. రిషి కపూర్, ఇర్పాన్‌ఖాన్‌ లాంటి వ్యక్తులనే కాకుండా చుట్టూ ఎంతో మందిని కోల్పోయాం. ఆ సమయంలో పాజిటివిటీని, ఆశావాదాన్ని నింపడానికి నా ఆలోచనలతో దీనిని రాశాను’ అన్నారు. కార్యక్రమంలో ఫిక్కీ ఫ్లో చైర్‌పర్సన్‌ ఉషారాణి మన్నె, పింకీ రెడ్డి, అపూర్వ జైన్, రేఖారెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top