56 ఏళ్ల వయసులో రెండో పెళ్లి.. అంతలోనే నటుడి విడాకులు? | Animal Actor Babloo Prithiveeraj To Divorce His Second Wife Rukmini Sheetal After 1 Year - Sakshi
Sakshi News home page

Babloo Prithiveeraj: పెళ్లైన ఏడాదికే రెండో భార్యకు విడాకులు? అందుకే వీడియో డిలీట్‌!

Published Fri, Dec 1 2023 1:16 PM

Animal Actor Babloo Prithiveeraj To Divorce His Second Wife Rukmini Sheetal After 7 Months - Sakshi

సీనియర్‌ నటుడు బబ్లూ పృథ్వీరాజ్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే! చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గానూ నటించారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్‌లోనూ నటించాడు. ఆ మధ్య అవకాశాల్లేక వెనుకబడిన నటుడు ఇప్పుడు మళ్లీ స్పీడు పెంచాడు. నేడు రిలీజైన యానిమల్‌ మూవీలోనూ కీలక పాత్రలో నటించాడు. అలాగే దయ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చాడు.

వృత్తిపరమైన విషయాల కంటే కూడా వ్యక్తిగత విషయాలతోనే తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు పృథ్వీరాజ్‌. 1994లో బీనాను పెళ్లాడిన ఇతడికి ఒక అహద్‌ మోహన్‌ జబ్బర్‌ అనే కొడుకు కూడా ఉన్నాడు. అన్యోన్యంగానే ఉంటున్నారనుకున్న క్రమంలో వీరి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. సుమారు ఆరేళ్లు విడివిడిగా జీవించిన వీరు గతేడాది విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది శీతల్‌కు దగ్గరయ్యాడు బబ్లూ. ఈమె తెలుగమ్మాయే.. బబ్లూ కంటే 30 ఏళ్లు చిన్నది. నటుడితోనే జీవితాన్ని గడిపేయాలనుకుంది.

వీరు గతేడాది నవంబర్‌లో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతలోనే వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది. వీరు విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. బబ్లూ తనకు ప్రపోజ్‌ చేసిన వీడియోను శీతల్‌ డిలీట్‌ చేయడంతో ఈ రూమర్స్‌ మరింత బలపడుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

చదవండి: నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Advertisement
 
Advertisement
 
Advertisement