ఇటీవల మరణించిన సినీ ప్రముఖులకు ఏపీ కేబినెట్‌ నివాళులు | Sakshi
Sakshi News home page

ఇటీవల మరణించిన సినీ ప్రముఖులకు ఏపీ కేబినెట్‌ నివాళులు

Published Wed, Feb 8 2023 3:36 PM

Andhra Pradesh Cabinet Pay Tribute To Cine Celebrities Who Died Recently - Sakshi

ఇటీవల మరణించిన తెలుగు సినీ ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం నివాళులర్పించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన  ఈ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 

సమావేశం అనంతరం ఇటీవల మరణించిన సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు, ఎం. బాలయ్య, కే.విశ్వనాథ్, వాణి జయరామ్, జమున, డైరెక్టర్‌ సాగర్‌కు నివాళి అర్పిస్తూ మంత్రివర్గం మౌనం పాటించింది. 

Advertisement
 
Advertisement