యాంకర్ విష్ణుప్రియకు అనారోగ్యమా? లేకపోతే అలా ఎందుకు! | Sakshi
Sakshi News home page

Vishnu Priya: హాట్ యాంకర్ విష్ణుప్రియ హెల్త్, కెరీర్ డిస్ట్రబ్?

Published Mon, Oct 30 2023 4:28 PM

Anchor Vishnu Priya Health Condition Instagram Post Viral - Sakshi

యాంకర్ అంటే ఒకప్పుడు సుమ పేరు మాత్రమే వినిపించేది. కానీ ఇప్పుడు బోలెడంత మంది ఉన్నారు. అనసూయ, రష్మీ, విష్ణుప్రియ.. ఇలా చెప్పుకుంటే పోతే యాంకరింగ్‌కి వీళ్లు గ్లామర్ తీసుకొచ్చారు. వీళ్ల కోసమే షోలు చూసేవాళ్లు ఉన్నారన్నా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. సరే ఇదంతా పక్కనబెడితే యాంకర్ విష్ణుప్రియ ప్రస్తుతం బాధలో ఉన్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 32 సినిమాలు రిలీజ్)

షార్ట్ ఫిల్మ్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన విష్ణుప్రియ.. ఆ తర్వాత ప్రముఖ ఛానెల్‌లో పలు షోలకు యాంకర్‌గా చేసింది. పండగ స్పెషల్ షోల్లో డ్యాన్సులు కూడా చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. దీంతో నటిగా ప్రయత్నాలు చేసింది. గతేడాది 'వాంటెడ్ పండుగాడ్' అనే మూవీలో హీరోయిన్‌గా చేసింది. రీసెంట్‌గా వచ్చిన 'దయ' వెబ్ సిరీసులో జర్నలిస్టుగా నటించింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది.

ఇలా అంతా బాగానే ఉన్నాసరే విష్ణుప్రియకు సరిగా అవకాశాలు రావట్లేదు అనుకుంటా. దీంతో తాజాగా ఇన్ స్టాలో ఓ స్టోరీ పెట్టింది. 'ఆరోగ్యం పాడైంది. కెరీర్ దెబ్బతింది. షెడ్యూల్స్, రిలేషన్స్.. ఇలా అన్నీ ఖరాబ్ అయినా సరే చిల్ అవుతున్నా' అని టెక్స్ట్ ఉన్న రీల్‌ని తన స్టోరీలో షేర్ చేసింది. ప్రస్తుతం తన పరిస్థితి ఇలానే ఉందని చెప్పుకొచ్చింది. దీనిబట్టి చూస్తుంటే విష్ణుప్రియకి అనారోగ్యం పాలైందా? అని ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు. అదే టైంలో కెరీర్ డిస్ట్రబ్ అయిందా? అని మాట్లాడుకుంటున్నారు. 

(ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్)

Advertisement
Advertisement