గుడ్‌ న్యూస్‌ చెప్పిన యాంకర్‌ సమీరా.. ఆ ఫోటోతో అలా..

Anchor Sameera Sherief Shares Her Pregnancy News Through Social Media - Sakshi

యంకర్‌గా, నటిగా తెలుగు బుల్లితెరను అలరించిన సమీరా షరీఫ్‌ తాజాగా ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. త్వరలోనే తాను ఓ బిడ్డకు తల్లి కాబోతున్నానని ప్రకటించింది. సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే ఈ యాంకరమ్మ.. తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అభిమానులలో చాలా ఢిపరెంట్‌గా పంచుకుంది. సమీరాతో పాటు ఆమె భర్త అన్వర్‌ ఒకే కలర్‌ టీషర్ట్స్‌ ధరించి, దానిపై ‘ఈ విషయం మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.. త్వరలో మాకు ఓ బేబీ రాబోతుంది'' అని రాసుకొచ్చారు. ఈ ఫోటోని సమీరా తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతంఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దంపతులకు నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా, 2006 లో ఆడపిల్ల అనే సీరియల్ తో కెరీర్ ప్రారంభించిన సమీరా బుల్లితెర నటుడు ప్రభాకర్ తో ఎన్నో సీరియల్స్ లో నటించింది. ముద్దుబిడ్డ, అభిషేకం, భార్యమణి, మూడు ముళ్ల బంధం వంటి ఎన్నో సీరియల్స్ లో ఆమె నటించింది. ఆ తర్వాత నాగబాబు జడ్జీగా వ్యవహరించిన ‘అదిరింది’ షోకి కొద్ది రోజులుపాటు యాంకర్‌గా చేసింది.ఈ తర్వాత ఈ యంకరమ్మ బుల్లితెరకు దూరమైంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top