Anchor Pradeep Marriage: పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్‌ ప్రదీప్‌? ఆమెతోనే ఏడడుగులు!

Anchor Pradeep Marriage Rumours Goes Viral With Fashion Designer - Sakshi

తెలుగు స్టార్‌ యాంకర్లలో ప్రదీప్‌ మాచిరాజు ఒకరు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్‌ తనదైన యాంకరింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ప్రదీప్ కామెడీ టైమింగ్‌కు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ఒకవైపు పలు టీవీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’  అనే సినిమాతో హీరోగా కూడా మారాడు. ఇదిలా ఉంటే బులితెరపై ఎంతో క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌కు లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే.

చదవండి: ఈ స్టార్‌ యాంకర్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? అందరికంటే ఎక్కువ ఎవరికంటే!

అందుకే తరచూ పెళ్లి రూమర్స్‌తో వార్తల్లో నిలుస్తుంటాడు ప్రదీప్‌. తాజాగా మరోసారి ప్రదీప్‌ పెళ్లి వార్తలు తెరపై వచ్చాయి. అయితే గతంలో ఇప్పటికే పలుమార్లు ప్రదీప్‌ పెళ్లంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే వాటిని ప్రతిసారి ఖండించాడు. కానీ ఈసారి మాత్రం ప్రదీప్‌ నిజంగానే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రదీప్‌ చేసుకోబోయే అమ్మాయి పేరు, ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ నవ్య మారోతును వివాహం చేసుకోబోతున్నాడంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. నవ్య.. ప్రదీప్‌ పర్సనల్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ని, ఆ పరిచయమే స్నేహం, ప్రేమగా మారిందంటున్నారు.

చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు హరనాథ్ కూతురు హఠాన్మరణం

కొంతకాలంగా వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని, ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంలో ఇరుకుటుంబాలు పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని ఫిలిం దూనియాలో టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించి ఇరుకుంటుంబాలు చర్చించుకుంటున్నారట. త్వరలోనే ప్రదీప్‌ గుడ్‌న్యూస్‌ చెప్పబోతున్నాడని సన్నిహితవర్గాలంటున్నాయి. అయితే వీరి మతాలు కూడా వేరే అనేది విశ్వసనీయ సమాచారం. మరీ ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ప్రదీప్‌ నుంచి క్లారిటీ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. నవ్య.. ప్రదీప్‌తో పాటు చాలా మంది సెలబ్రెటీలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుందట. బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు కూడా ఆమె కాస్ట్యూమ్‌ డిజైన్ చేస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top