ఆనంద్ దేవ‌ర‌కొండ ‘హైవే’ షూటింగ్‌ పూర్తి | Anand Deverakonda Highway Movie Shooting Wrapped UP In Hyderabad | Sakshi
Sakshi News home page

Anand Devarakonda: ఆనంద్ దేవ‌ర‌కొండ ‘హైవే’ షూటింగ్‌ పూర్తి

Oct 8 2021 7:31 PM | Updated on Oct 8 2021 8:17 PM

Anand Deverakonda Highway Movie Shooting Wrapped UP In Hyderabad - Sakshi

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ హీరోగా ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్‌ థ్రిల్లర్ ‘హైవే’. మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది.  తొలి చిత్రం ‘చుట్టాలబ్బాయి’ ఘనవిజయం సాధించి ఇండస్ట్రీలో అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న నిర్మాత‌ వెంకట్‌ తలారి శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్యాచీ టైటిల్‌తో పాటు డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంపై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.

తాజాగా ‘హైవే’ షూటింగ్ పూర్త‌యింది. ఈ సందర్భంగా మేకర్స్‌ పోస్ట‌ర్‌ను విడుదల చేస్తూ మూవీ షూటింగ్‌ పూర్తయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్‌ తలారి మాట్లాడుతూ.. ‘శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ బేనర్‌పై ఒక డిఫ‌రెంట్ క్రై మ్‌ థ్రిల్లర్‌ గా  ‘హైవే’ మూవీ రూపొందుతోంది. 118 వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన గుహ‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆనంద్ దేవ‌ర‌కొండ‌, మాన‌స రాధాకృష్ణన్ హీరోహీరోయిన్లుగా న‌టించారు.

నేడు హైవే మూవీ షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. తెలంగాణ‌, ఆంధ్ర ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో షూటింగ్ జ‌రిపాం. ఈ సినిమాలో కొంత మంది ప్ర‌ముఖ న‌టీన‌టులు కూడా నటించారు. వారి వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం’ అన్నారు. చిత్ర దర్శకుడు కేవీ గుహన్‌ మాట్లాడుతూ.. ‘‘హైవే’ నేపథ్యంలో సాగే ఒక సైకో క్రై మ్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. ప్ర‌తిక్ష‌ణం ట్విస్టులు, ట‌ర్నుల‌తో ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ప్ర‌స్తుతం హైవే షూటింగ్‌ పూర్త‌య్యింది. త్వ‌ర‌లో కొన్ని క్రేజీ అప్‌డేట్స్‌తో మీ ముందుకు వ‌స్తాం’’ అని పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement