ప్రభాస్‌ మూవీకి బిగ్‌బీ భారీ రెమ్యునరేషన్‌

Amitabh Bachchan Shocking Remuneration For Prabhas Film - Sakshi

ప్రభాస్‌ హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు. ఆయన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ 50 ఏళ్ల ప్రయాణంలో భాగంగా ఈ భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఇందులో దీపికా పదుకోన్‌ హీరోయిన్‌. ఈ సినిమాలో సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటించబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే వెల్లడించింది.  అమితాబ్‌ రాకతో ఈ ప్రాజెక్టుకు మరింత హైప్‌ క్రియేట్‌ అయింది. ఈ చిత్రం కోసం అమితాబ్‌ 40 రోజుల కాల్‌షీట్స్‌  ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో అమితాబ్‌ ఈ సినిమాకు ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారనేది హాట్‌ టాపిక్‌గా మారింది.
(చదవండి : ‘రాధే శ్యామ్‌’ లో ప్రేరణగా పూజా.. ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌)
 
పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అమితాబ్‌కు భారీ రెమ్యునరేషన్‌ ఇస్తున్నట్లు వినికిడి. ఇప్పటికే పాత్ర తీరు తెన్నులను వివరిస్తూ అమితాబ్‌కు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మెయిల్‌ పంపారట. ఆయనకు కూడా పాత్ర నచ్చడంతో 40 రోజుల కాల్‌షీట్స్‌ ఇచ్చారని టాక్‌.  ఈ పాత్ర చేస్తున్నందుకు అమితాబ్‌కు  25 కోట్ల రూపాయల పారితోషికాన్ని ఇస్తున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ సినిమా కోసం దీపికా పదుకోన్‌ కూడా సుమారు పాతిక కోట్లు తీసుకోబోతున్నట్లువార్తలొచ్చాయి. సైన్స్‌ ఫిక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top