సందేశాత్మక చిత్రం.. నాకు బాగా నచ్చింది: బన్నీ

Allu Arjun Appreciated Palasa 1978 Movie Team - Sakshi

సామాజికంగా వెనుకబడిన  కులాలకు చెందిన వారిని రాజకీయంగా ఏవిధంగా దోచుకుంటున్నారో కళ్లకుకట్టినట్లు తెరపై చూపించిన సినిమా పలాస 1978. ఈ ఏడాది ప్రతమార్థంలో థియేటర్లకు వచ్చిన ఈ మూవీ హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది. కరుణ కుమార్‌ దర్శకత్వంలో రక్షిత్‌, నక్షత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం శ్రీకాళం జిల్లాల్లోని పలాసనలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. నాటి సమాజంలో కుల, వర్ణ వివక్ష నాటు ఏ విధంగా ఉందో ఈ చిత్రం ద్వారా దర్శకుడు చూపించే ప్రయత్నం చేసి కొంతమేర విజయం సాధించాడు. ముఖ్యంగా సంగీత దర్శకుడు రఘు కుంచె సమకూర్చిన పాటలు చిత్రానికి హైలట్‌గా నిలిచాయి. నాది నక్కిలీసు గొలుసు అనే పాట సోషల్‌ మీడియాలో ఏవిధంగా ట్రెండ్‌ అయ్యింది ప్రతిఒక్కరికీ తెలిసిందే.

అయితే ఈ చిత్రాన్ని ఇటీవల వీక్షించిన స్టైలిస్‌స్టార్ అల్లు అర్జున్‌ చిత్ర దర్శకుడికి ప్రత్యేక అభినందనలు తెలిపాడు. తనకు వ్యక్తిగతంగా పలాస మూవీ ఎంతో నచ్చిందని, చిత్ర యూనిట్‌ను ప్ర‌శంసించాడు. ‘పలాసా 1978 మూవీ బృందానికి అభినందనలు. ఈ చిత్రాన్ని చూసిన‌ మరుసటి రోజు ఉదయం దర్శకుడిని కలిశాను. గొప్ప అంతర్లీన సందేశంతో అద్భుతమైన ప్రయత్నం చేశారు. వ్య‌క్తిగతంగా చిత్రం చాలా న‌చ్చింది. చాలా మంచి సందేశం ఉంది’ అంటూ ప‌లాస ద‌ర్శ‌కుడితో దిగిన ఫోటో షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top