వేసవిలో షురూ | Allu Arjun and Trivikram Srinivas combination for their 4th film | Sakshi
Sakshi News home page

వేసవిలో షురూ

Dec 11 2024 1:54 AM | Updated on Dec 11 2024 1:54 AM

Allu Arjun and Trivikram Srinivas combination for their 4th film

‘పుష్ప 2: ది రూల్‌’ సినిమా సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నారు అల్లు అర్జున్ . అయితే ఆయన నటించనున్న తర్వాతి చిత్రంపై ఫిల్మ్‌నగర్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్  ఇప్పటికే దర్శకులు త్రివిక్రమ్‌ శ్రీనివాస్, సందీప్‌ రెడ్డి వంగాలతో సినిమాలు చేసేందుకు పచ్చజెండా ఊపారు. అయితే ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ సినిమా చేసే పనిలో బిజీగా ఉన్నారు సందీప్‌ రెడ్డి.

దీంతో అల్లు అర్జున్  తర్వాతి మూవీ త్రివిక్రమ్‌తోనే ఉండబోతుందనే విషయం స్పష్టం అవుతోంది. ‘జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో...’ వంటి సూపర్‌హిట్‌ ఫిల్మ్స్‌ తర్వాత అల్లు అర్జున్ , త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. హారిక హాసినీ క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్‌ సంస్థలు నిర్మించనున్న ఈ సినిమాని గత ఏడాది జూలైలో ప్రకటించారు. 

ఈ సినిమా గురించి సంక్రాంతి సందర్భంగా ఓ స్పెషల్‌ వీడియోను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. అంతేకాదు.. ఈ మూవీని వచ్చే వేసవిలో సెట్స్‌పైకి తీసుకెళ్లేలా సన్నాహాలు చేస్తున్నారట అల్లు అర్జున్ , త్రివిక్రమ్‌. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement