అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో 'రాకా' చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఫోకస్ అంతా దీనిమీదే ఉంది. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాని వచ్చే ఏడాది చివరలో లేదంటే 2028లో థియేటర్లలో రిలీజ్ చేయొచ్చని అంటున్నారు. అలానే ఒకే మూవీగా విడుదల చేయాలా లేదంటే రెండు భాగాలుగా చేయాలా అనే విషయమై చర్చలు జరుగుతున్నాయి.
(ఇదీ చదవండి: ఏడాది తిరిగేసరికి మళ్లీ తల్లి కాబోతున్న 'టాక్సిక్' హీరోయిన్)
ఇవలా ఉండగానే 'రాకా' తర్వాత అల్లు అర్జున్.. లోకేశ్ కనగరాజ్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోయిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. టాలీవుడ్ బడానిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. గ్రాండ్‌గా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. ఇది జరిగి చాన్నాళ్లపోయింది. అప్పటినుంచి బన్నీ 'రాకా'తో బిజీగా ఉండగా.. లోకేశ్ 'డిసి' అనే మూవీలో హీరోగా చేశాడు. హిందీలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడనే టాక్ వినిపిస్తుంది. ఇలా ఎవరికి వాళ్లు కెరీర్ పరంగా బిజీగా ఉండేసరికి పుకార్లు మొదలయ్యాయి.
నిజం ఏంటంటే ప్రస్తుతం #AA23 ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అల్లు అర్జున్- లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్తుందని సమాచారం. కానీ ఇంతలోనే రూమర్స్ వినిపించడంతో బన్నీ ఫ్యాన్స్ కంగారుపడ్డారు.మరోవైపు బన్నీ.. బోయపాటి శీనుతోనూ ఓ మూవీ చేయనున్నాడని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
(ఇదీ చదవండి: చిన్నప్పటి నుంచి తిరుమలకు వస్తున్నా.. ఈసారిలా ఎప్పుడూ జరగలేదు: హీరోయిన్ తమన్నా)


