అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిక..

Alia Bhatt gets hospitalised For Mild illness - Sakshi

ముంబై: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో రాంచరణ్‌ సరసన నటిస్తున్న బాలీవుడ్‌ భామ అలియా భట్ స్వల్ప అస్వస్థతకు లోనైంది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న 'గంగూబాయి కతియావాడి' చిత్రీకరణ సందర్భంగా ఆమె హైపరాసిడిటీ, అలసట, వికారంతో బాధపడటంతో ముంబైలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. గంగూబాయి చిత్ర యూనిట్‌ అందించిన సమాచారం ప్రకారం.. జనవరి 17న ముంబైలో జరిగిన షూటింగ్‌లో పాల్గొన్న ఆలియా.. స్వల్ప అస్వప్థతకు లోనుకావటంతో నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ప్రాధమిక చికిత్స తీసుకున్న అనంతరం, అదే రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

కాగా, గంగూబాయి చిత్రం ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌ రాజ్, శాంతను మహేశ్వరి, సీమా పహ్వా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ గల్లీబాయ్‌ హీరోయిన్‌.. గంగూబాయితో పాటు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో 'బ్రహ్మాస్త్రా', రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రాల్లో నటిస్తుంది. ఇదిలావుండగా, ఆలియా ఇటీవలే రణబీర్ కపూర్ అతని కుటుంబ సభ్యులతో కలిసి హాలిడేను ఆస్వాదించి ముంబైకి తిరిగి వచ్చింది. హాలిడేకు సంబంధించిన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top