
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya ) తండేల్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత చైతూ విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో పని చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి వృషకర్మ అనే (వర్కింగ్ టైటిల్) ఖరారు చేశారు. ఇది నాగచైతన్య కెరీర్‌లో 24వ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారని టాక్. బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా నాగ చైతన్య తాజాగా ఓ ప్రోగ్రామ్కు హాజరయ్యారు. టాలీవుడ్ నటుడు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము.. నిశ్చయమ్మురా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య తన కెరీర్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు మైథలాజికల్ క్యారెక్టర్ చేయాలనుందని మనసులోని మాటను బయటపెట్టారు. నాన్నలాగా అన్నమయ్య, శ్రీ రామదాసు లాంటి సినిమాలు చేయాలనుందని కోరికను వెల్లడించారు. ఇది విన్న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.