మిస్టర్‌ మజ్నూకు యూట్యూబ్‌లో భారీ ఆదరణ

Akhil Akkinenis Hindi Dubbed Version Of Mr Majnu Gets Record Views - Sakshi

10 కోట్ల వ్యూస్‌తో రికార్డు

సాక్షి, హైదరాబాద్‌ : అఖిల్‌ అక్కినేని నటించిన తెలుగు మూవీ మిస్టర్‌ మజ్నూ హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ సాధించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ మూవీ యూట్యూబ్‌లో 10 కోట్ల వ్యూస్‌ను రాబట్టింది. మిస్టర్‌ మజ్నూ అఖిల్‌ నటించిన మూడో సినిమా. జులై 4న మిస్టర్‌ మజ్నూ హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయగా, కేవలం నెల వ్యవధిలోనే రికార్డు వ్యూస్‌ను సాధించింది.

2019లో ఈ సినిమా విడుదలైనప్పుడు మూవీకి విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఇక అఖిల్‌ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌ నిర్ధేశకత్వంలో తెరకెక్కిన మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ మూవీ విడుదల కోసం వేచిచూస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ విడుదల  కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడింది. చదవండి : సంక్రాంతికి ఫిక్స్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top