ప్రగ్యా జైస్వాల్‌ కట్టుకున్న చీర ఖరీదెంతో తెలుసా? | Akhanda Heroine Pragya Jaiswal Liked Designer Clothes | Sakshi
Sakshi News home page

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌ కట్టుకున్న చీర ఖరీదెంతో తెలుసా?

Dec 19 2021 4:45 PM | Updated on Dec 19 2021 7:57 PM

Akhanda Heroine Pragya Jaiswal Liked Designer Clothes - Sakshi

‘కంచె’ సినిమాలో సంప్రదాయకట్టుతో కనిపించిన ప్రగ్యా జైస్వాల్‌.. ఫ్యాషన్‌ అవుట్‌ ఫిట్స్‌లోనూ అంతే మెరుస్తుంది. ఆ ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేసే బ్రాండ్స్‌ ఇవే..

అనావిలా..
 ముతక చీరలంటే ముసలివాళ్లకు మాత్రమే అనుకునే ఎంతోమంది ఆలోచనను మార్చేసింది ముంబైకి చెందిన అనామిలా మిశ్రా. 2004లో ‘అనామిలా’ పేరుతో లెనిన్‌ ఫ్యాబ్రిక్‌ ఉపయోగించి, డిజైన్‌ చేసిన శారీ కలెక్షన్స్‌ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆ క్రేజ్‌ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. బోరింగ్‌ డిజైన్స్‌కు చెక్‌ పెట్టేలా ఉండే ఈ డిజైన్స్‌కు సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతారు. కేవలం లెనిన్‌ ఫ్యాబ్రిక్‌ చీరలనే అనామిలా డిజైన్‌ చేస్తుంది. అయితే, వీటి ధర సాధారణ పట్టుచీర కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. విదేశాల్లోనూ వీటికి మంచి గిరాకి ఉంది. ముంబైలో మెయిన్‌ బ్రాంచ్‌ ఉంది. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయొచ్చు.

హౌజ్‌ ఆఫ్‌ శిఖా
చాలామంది అమ్మాయిల్లాగే .. శిఖా మంగల్‌కు కూడా ఆభరణాలంటే ఇష్టం. ఆ ఇష్టం పెద్దయ్యాక ఆసక్తిగా మారింది. అలా బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేసి, 2014లో ‘హౌజ్‌ ఆఫ్‌ శిఖా’ ప్రారంభించింది. ఇదొక ఆన్‌లైన్‌ జ్యూయెలరీ స్టోర్‌. ప్రముఖ డిజైనర్స్‌ అందించే అందమైన ఆభరణాలన్నీ ఇక్కడ లభిస్తాయి. కొత్తతరం డిజైనర్స్‌కు ప్రాముఖ్యతనివ్వడంతో, డిజైన్స్‌ అన్నింటిలోనూ న్యూస్టయిల్‌ ప్రతిబింబిస్తుంది. అదే దీని బ్రాండ్‌ వాల్యూ. పేరుకు దేశీ బ్రాండ్‌ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లో మాత్రమే కొనుగోలు చేయొచ్చు. టోట్‌ బ్యాగ్స్‌ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా వాటినే షాపింగ్‌ చేస్తుంటా. కేవలం ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ధరించే దుస్తులపై దృష్టి సారిస్తా.

చదవండి: Sai Pallavi : స్టేజ్‌ మీద సాయి పల్లవి కన్నీళ్లు.. కారణం ఏంటంటే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement