అజయ్‌ దర్శకత్వంలో అమితాబ్‌

Ajay Devgn to direct Amitabh Bachchan in upcoming Film - Sakshi

అమితాబ్‌ బచ్చన్, అజయ్‌ దేవగన్‌ కలసి పలు సినిమాలు చేశారు. ఈ చిత్రాల్లో వాళ్ల ఈక్వేషన్‌ కేవలం యాక్టర్‌–యాక్టర్‌గా.. అంతే. ‘మేజర్‌ సాబ్, ఖాకీ, సత్యాగ్రహ (2013)’ సినిమాలు చేశారు అమితాబ్, అజయ్‌. ఏడేళ్ల గ్యాప్‌ తర్వాత ఈ ఇద్దరూ కలసి ఓ సినిమా చేయబోతున్నారు. కానీ ఈసారి యాక్టర్‌–డైరెక్టర్‌ ఈక్వేషన్‌లో. అజయ్‌ దేవగన్‌ దర్శకత్వంలో అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘మే డే’ టైటిల్‌తో తెరకెక్కే ఈ సినిమాలో అజయ్‌ దేవగన్‌ పైలెట్‌ పాత్రలో నటించనున్నారు. థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందనున్న ఈ సినిమా డిసెంబర్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమాను అజయ్‌ తన సొంత బ్యానర్‌ అజయ్‌ దేవగన్‌ ఫిల్మ్స్‌పై నిర్మించనున్నారు. గతంలో ‘యూ మీ ఔర్‌ హమ్, శివాయ’ సినిమాలకు దర్శకత్వం వహించారు అజయ్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top