పెళ్లిపై భయం.. అలాంటి వ్యక్తితో బిడ్డను కనాలని ఉంది: హీరోయిన్‌ | Aishwarya Lekshmi Opens Up About Motherhood, Says She Wants A Child Despite Doubts About Marriage | Sakshi
Sakshi News home page

జీవితంలోకి అలాంటి వ్యక్తి వస్తే.. ఒక బిడ్డను కనాలని ఉంది : హీరోయిన్‌

Jul 4 2026 8:52 AM | Updated on Jul 4 2026 9:48 AM

Aishwarya Lekshmi Says I want To Have A Child

ప్రస్తుతం మాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌ అంటూ చుట్టేస్తున్న నటి ఐశ్వర్య లక్ష్మి. ఈ మలయాళీ భామ నిర్మాత కూడా. ముఖ్యమైన దక్షిణాది కథానాయికల్లో ఈమె ఒకరు. 2017లో మాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ 2019లో యాక్షన్‌ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అయ్యారు. ఆ తరువాత ఇక్కడ జగమేతంతిరం, కార్గీ, పొన్నియిన్‌ సెల్వన్‌, కట్టాకుస్తీ, మామన్‌ వంటి సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారు. 

ఇటీవల టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చారు. ఈ 34 ఏళ్ల పరువాల బ్యూటీ ఇప్పటికీ అవివాహితేనన్నది గమనార్హం. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా చెప్పే ఐశ్వర్య లక్ష్మి వివాహం పైనా తనకు నమ్మకం లేదని, ఇంతకు ముందు పలు మార్లు చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటిది ఇటీవల అమ్మతనంపై ఇష్టాన్ని వ్యక్తం చేయడం విశేషం. ఈ తాజాగా కట్టా కుస్తీ–2 చిత్రంలో నటుడు విష్ణు విశాల్‌కు జంటగా నటించారు. 

ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. భార్యాభర్తల అనుబంధం ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రంలో కుస్తీ క్రీడాకారిణిగా ఐశ్వర్య లక్ష్మి నటించారు. సమీప కాలంలో ఈ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఈ భామ తన వివాహానికి సంబంధించిన ప్రశ్నకు బదులిస్తూ వివాహం అనే వ్యవస్థపై తనకు చాలా సమస్యలు ఉన్నాయన్నారు. 

అయితే కట్టాకుస్తీ–2 చిత్రంలో ఒక చిన్నారితో సన్నిహితంగా ఉన్నప్పుడు తనలో అమ్మతనం కలిగిందన్నారు. తనకోసం వచ్చేవాడు మంచి తండ్రి అవుతాడా తనను వదిలి వెళ్లిపోకుండా ఉంటాడా అనే అనుమానాలు ఉన్నాయన్నారు. కనీసం తనను శ్రద్ధగా చూసుకునే వ్యక్తితో తాను ఒక బిడ్డను కనాలని కోరుకుంటున్నానని నటి ఐశ్వర్య లక్ష్మి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈమె సంబరాల ఏటి గట్టు అనే తెలుగు చిత్రంతోపాటు మలయాళంలో ఆషా అనే చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement