గెట్ రెడీ ఫర్ ఆడిషన్స్.. త్వరలోనే తెలుగు ఇండియన్ ఐడల్ | AHA Telugu Indian Idol Season 2 Auditions Coming Soon | Sakshi
Sakshi News home page

Telugu Indian Idol Season 2: త్వరలోనే ఇండియన్ ఐడల్ సీజన్-2 ఆడిషన్స్ ప్రారంభం

Published Tue, Jan 17 2023 8:02 PM | Last Updated on Tue, Jan 17 2023 8:02 PM

AHA Telugu Indian Idol Season 2 Auditions Coming Soon - Sakshi

ప్ర‌ముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వ‌హించిన తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్-1 సంగీత ప్రియులను అలరించింది. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో ఆహా మరోసారి ప్రేక్షకులకు కనివిందుల చేసేందుకు సిద్ధమైంది. ఎంతో టాలెంట్ ఉన్న యంగ్ అండ్ డైనమిక్ సింగర్స్ ప్రతిభను వెలికితీసేందుకు మరోసారి రెడీ అయింది. త్వరలోనే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ -2తో మీ ముందుకొస్తున్నట్లు ప్రకటించింది ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా. దీనికి సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేసింది. త్వరలోనే ఆడిషన్స్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. 

మొదటి సీజన్‌కు ప్రేక్షకుల అద్భుతమైన స్పందన లభించింది. తెలుగు ఇండియన్ ఐడల్‌ను బ్లాక్‌బస్టర్ హిట్‌ కావడంతో సీజన్‌-2 సరికొత్తగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభ కలిగిన సింగర్స్‌కు ఈ షో చక్కని అవకాశం కల్పించనుంది.  ఈ బిగ్గెస్ట్ సింగింగ్ రియాలిటీ షోకి సంబంధించిన ఆడిషన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

తొలి ఇండియన్ ఐడల్ తొలి సీజన్‌లో నెల్లూరుకు చెందిన యువ ప్రతిభావంతులైన గాయని బీవీకే వాగ్దేవి గెలుచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆమె ప్రైజ్ మనీతో పాటు రూ.లక్ష విలువైన ట్రోఫీని అందించాడు. చిరుతో పాటు రానా, సాయిప‌ల్ల‌వి ఈ షోలో సంద‌డి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement