తెలుగు ఫిలిం చాంబర్‌పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

Adiseshagiri Rao: తెలుగు ఫిలిం చాంబర్‌పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు

Published Thu, May 19 2022 12:43 PM

Adiseshagiri Rao Shocking Comments On Film Chamber, Producers Council - Sakshi

పైరసీని అరికట్టడంలో ఫిలిం చాంబర్‌ విఫలమైందని నిర్మాత ఆదిశేషగిరిరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందన్నారు. అలాగే ఫిల్మ్‌ పైరసీని అరికట్టడంలో ఫిలించాంబర్‌ విఫలమైందని, సినిమాలు విడుదలైన మరుసటి రోజే ఆన్‌లైన్‌లో, యూట్యూబ్‌లో వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటీటీ, అందులో వస్తున్న కంటెంట్‌పై స్పందించారు.

చదవండి: ఓ ఇంటివాడైన హీరో ఆది, పెళ్లి ఫొటోలు వైరల్‌

ప్రస్తుతం ఓటీటీ సమస్యగా మారిందని, సెన్సార్‌ లేకుండా కంటెంట్‌ వస్తుందన్నారు. అనంతరం ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో నెగిటివ్‌ న్యూస్‌ బాగా వేస్తున్నారన్నారు. చివరగా టికెట్ల రెట్స్‌ పెంచడం మంచిది కాదని నిర్మాత దిల్‌ రాజు మాట్లాడారని, అలాంటప్పుడు ప్రభుత్వంను పెంచమని అడిగేటప్పుడే ఫ్లెక్సిబుల్‌ రెట్స్‌ గురించి తెలుసుకుని అడగాల్సిందన్నారు. అలా చేస్తే సమస్యలు వచ్చేవికావని ఆయన అభిప్రాపడ్డారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement