'హనుమాన్' నటి పెళ్లి డేట్ ఫిక్సయిందా? ఎప్పుడంటే? | Sakshi
Sakshi News home page

Varalaxmi Sarathkumar: డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్న 'హనుమాన్' నటి?

Published Wed, May 29 2024 8:47 AM

 Actress Varalaxmi Sarathkumar Wedding In Thailand

హీరోయిన్ల పెళ్లి అంటే మినిమం హడావుడి గ్యారంటీ. అలా కాకుండా ఎవరైనా చేసుకున్నారా అంటే చాలా తక్కువ మందే ఉంటారు. ఇకపోతే హీరోయిన్లలో చాలామంది ఏజ్ బార్ అయిన తర్వాతే ఏడడుగులు వేస్తుంటారు. ఈ లిస్టులోకి ఇప్పుడు 'హనుమాన్' వరలక్ష‍్మి శరత్ కుమార్ చేరబోతుంది. ఇదివరకే నిశ్చితార్థం చేసుకోగా, ఇప్పుడు పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టైల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసిందట.

(ఇదీ చదవండి: పెళ్లి గురించి హింట్ ఇచ్చేసిన హీరోయిన్ అంజలి.. త్వరలో శుభవార్త)

తమిళ నటుడు శరత్ కుమార్ వారసురాలు వరలక్ష‍్మీ. 2012లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. కానీ పెద్దగా కలిసి రాలేదు. దీంతో రూట్ మార్చి క్యారెక్టర్ ఆర్టిస్టు అయింది. అప్పటి నుంచి ఈమె దశ తిరిగిపోయింది. తెలుగు, తమిళంలో వరస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. రీసెంట్‌గా 'హనుమాన్' మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.

39 ఏళ్లు వచ్చేసినా సరే పెళ్లికి దూరంగా ఉంటూ వచ్చింది. కానీ ఈ ఏడాది మార్చిలో నికోలాయ్ సచ్‌దేవ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చింది. పెళ్లి ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఆ డేట్ ఫిక్స్ అయిందని, జూలై 2న థాయ్‌ల్యాండ్‌లో వివాహ వేడుక జరనుందని తెలుస్తోంది. ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టేశారని టాక్. అది అయిన తర్వాత చెన్నైలో రిసెప్షన్ ఉండనుందని సమాచారం.

(ఇదీ చదవండి: పెళ్లయిన మూడు నెలలకే విడిపోతున్నారా? అసలు విషయం ఇది)

Advertisement
 
Advertisement
 
Advertisement