గొంతు పోగొట్టుకున్న నటి.. మాట్లాడలేని స్థితిలో! | Actress Thara Kalyan Daughter Sowbhagya Venkitesh Opens Up About Her Mother Health Condition | Sakshi
Sakshi News home page

ఆ వ్యాధి వల్లే నటి గొంతు మూగబోయింది.. ఆమె మాట్లాడలేదా?

Mar 21 2024 7:20 PM | Updated on Mar 21 2024 7:31 PM

Actress Thara Kalyan Daughter Sowbhagya Venkitesh Opens Up About Her Mother Health Condition - Sakshi

రెండేళ్ల క్రితం అమ్మకు సర్జరీ జరిగింది. దాని వల్లే ఇప్పుడు గొంతు పోయిందనుకున్నాం.  కానీ...

మలయాళ నటి, క్లాసికల్‌ డ్యాన్సర్‌ తారా కల్యాణ్‌ స్పాస్మోడిక్‌ డిస్ఫోనియా అనే గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతోంది. దీని వల్ల ఆమె మాట్లాడలేకపోతోంది. బలం కూడదీసుకుని ఒక్క పదం పలకాలన్నా ఎంతో ఇబ్బందిగా ఉంటోందట! తాత్కాలికంగా ఆమె గొంతును కోల్పోయిందని తారా కల్యాణ్‌ కూతురు సౌభాగ్య వెంకటేశ్‌ వెల్లడించింది. తన యూట్యూబ్‌ ఛానల్‌లో తల్లి సమస్యను బయటపెట్టింది.

'రెండేళ్ల క్రితం అమ్మకు థైరాయిడ్‌ సంబంధిత సర్జరీ జరిగింది. దాని వల్లే ఇప్పుడు గొంతు పోయిందనుకున్నాం. పైగా చాలా ఏళ్లుగా తన వాయిస్‌ను ఉపయోగించే డ్యాన్స్‌ క్లాసులు నేర్పిస్తూ ఉంటుంది. ఎక్కువగా గొంతును ఉపయోగించడం వల్ల కూడా ఇలా జరిగి ఉండొచ్చనుకున్నాం. కానీ స్పాస్మోడిక్‌ డిస్‌ఫోనియా అనే వ్యాధి వచ్చిందని, దానివల్లే గొంతు మూగబోయిందని తెలిసింది. బొటాక్స్‌ చేయిస్తే అమ్మ కోలుకుంటుందన్నారు.

ఆ సర్జరీ చేసే సమయంలోనే అమ్మమ్మ(తారా తల్లి) చనిపోయింది. వైద్యులు తనను పూర్తిగా విశ్రాంతి తీసుకోమన్నారు. కానీ అమ్మమ్మ చనిపోయిన బాధ ఒకవైపు అమ్మను కుంగదీస్తోంది. ప్రస్తుతం మంచినీళ్లు తాగడానికి కూడా అమ్మ ఇబ్బందిపడుతోంది. తగిన విశ్రాంతి తీసుకుంటే వీలైనంత త్వరగానే అమ్మ ఎప్పటిలా మాట్లాడగలదు' అని చెప్పుకొచ్చింది.

చదవండి: హీరోయిన్‌ నయా బిజినెస్‌! వాడిపడేసిన చీరలు అమ్మకానికి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement