బెస్ట్‌ ఫ్రెండ్‌తో పెళ్లి రద్దు.. మరొకరితో నటి ఏడడుగులు | Actress Shree Gopika Get Married to Varun Dev | Sakshi
Sakshi News home page

Shree Gopika: జూన్‌లో ఎంగేజ్‌మెంట్‌.. కట్‌ చేస్తే మరొకరితో నటి పెళ్లి

Oct 7 2024 6:43 PM | Updated on Oct 7 2024 7:35 PM

Actress Shree Gopika Get Married to Varun Dev

మలయాళ నటి శ్రీ గోపిక గుడ్‌న్యూస్‌ చెప్పింది. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టినట్లు వెల్లడించింది. వరుణ్‌దేవ్‌తో ఏడడుగులు వేశానని తెలిపింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా తన పెళ్లి ఫోటోలు షేర్‌ చేసింది. అందులో నటి ఎంతో సింపుల్‌గా, క్యూట్‌గా ఉంది.

జూన్‌లో ఎంగేజ్‌మెంట్‌
కాగా గోపిక.. గతంలో తన బెస్ట్‌ ఫ్రెండ్‌ వైశాఖ్‌ రవితో పెళ్లికి రెడీ అయింది. వీరిద్దరికీ ఈ ఏడాది జూన్‌లో ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను సైతం ఇరువురూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. కానీ పెళ్లి చేసుకునేలోపే ఇద్దరూ విడిపోయారు. నిశ్చితార్థం ఫోటోలను సైతం డిలీట్‌ చేశారు. ఇంతలోనే శ్రీగోపిక పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ జంట కలకాలం కలిసుండాలని కోరుకుంటున్నారు.

వైశాఖ్‌తో శ్రీగోపిక ఎంగేజ్‌మెంట్‌ ఫోటో

సినిమా, సీరియల్స్‌
కాగా శ్రీ గోపిక.. 90 ఎమ్‌ఎల్‌ అనే తమిళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. రూల్‌ నెంబర్‌ 4, వోల్ఫ్‌ వంటి తమిళ చిత్రాలతో పాటు నాన్సెన్స్‌ అనే మలయాళ మూవీలోనూ మెరిసింది. బుల్లితెరపై ఉయిరే సీరియల్‌తో క్రేజ్‌ తెచ్చుకుంది. 

చదవండి: Bigg Boss Tamil: ఎలిమినేషన్‌లో కొత్త ట్విస్ట్ ఇచ్చిన తమిళ బిగ్‌బాస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement