Actress Shanoor Sana Begum Talk About Her Personal Life - Sakshi
Sakshi News home page

Shanoor Sana Begum: దుబాయ్‌ తీసుకెళ్లి డబ్బు, బంగారం లాక్కుని నా కూతురిని చిత్రహింసలు..

Mar 24 2023 10:18 AM | Updated on Mar 24 2023 10:42 AM

Actress Shanoor Sana Begum About her Personal Life - Sakshi

జారి కింద పడటంతో చేతికి ఫ్రాక్చర్‌ అయింది. సర్జరీ చేయడంతో మూడు నెలలు రెస్ట్‌ తీసుకోవాల్సి వచ్చింది. అలా కొంతకాలం సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకున్నాను. 

అటు బుల్లితెరపై సీరియల్స్‌లోనే కాకుండా ఇటు వెండితెరపై దాదాపు 600 చిత్రాల్లో నటించింది సనా బేగమ్‌. ఇటీవలే రిలీజైన రంగమార్తాండ చిత్రంలోనూ విభిన్న పాత్ర పోషించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'మొదట యాడ్‌ షూటింగ్స్‌ నుంచి నా ప్రయాణం మొదలైంది. నాకు మా అత్తామామయ్య బాగా సపోర్ట్‌ చేశారు. కానీ చుట్టుపక్కల వాళ్లు ఏంటి, మీ కోడలు ఇలా చేస్తుంది.. బుర్ఖా వేసుకోవట్లేదు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇలా ఎన్నో మాటలన్నారు. కానీ వారు ఆ మాటలను లెక్క చేయలేదు. నాకు హీరోయిన్‌ ఛాన్సులు కూడా వచ్చాయి. కాకపోతే పెళ్లైంది, పిల్లలున్నారని చెప్పొద్దన్నారు.. స్విమ్‌ సూట్‌ వేయాలి, ఎక్స్‌పోజింగ్‌ చేయాలన్నారు. అలా ఆ అవకాశాలు తిరస్కరించాను.

కన్నడలో ఇతర భాషా నటీనటులను పెద్దగా యాక్సెప్ట్‌ చేసేవారు కాదు. సైనిక సినిమా షూటింగ్‌లో పెద్ద పెద్ద డైలాగులు చెప్పే సీన్‌ ఉంది. నేను నేర్చుకుని డైలాగ్స్‌ చెప్తుంటే డైరెక్టర్‌ వన్‌మోర్‌ అంటూ నాతో చాలా సీరియస్‌గా మాట్లాడాడు. వాళ్లు పిలిస్తేనే వెళ్లాను, అలాంటప్పుడు నామీదెందుకు కోపగించుకోవడం అనిపించింది.  కోవిడ్‌ తర్వాత ఆర్జీవీ తీసిన ఓ హిందీ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ కోసం అనంతపురం వెళ్లాను. అక్కడ జారి కింద పడటంతో చేతికి ఫ్రాక్చర్‌ అయింది. సర్జరీ చేయడంతో మూడు నెలలు రెస్ట్‌ తీసుకోవాల్సి వచ్చింది. అలా కొంతకాలం సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకున్నాను. 

నా కూతురికి కూడా చిన్న వయసులోనే సినిమా ఛాన్సులు వచ్చాయి. కానీ తనకు ఆసక్తి లేకపోవడంతో వాటిని వదిలేసుకుంది. ప్రస్తుతం ఆమె యూట్యూబ్‌ ఛానల్‌ రన్‌ చేస్తోంది. నా కూతురికి పెళ్లి చేశాక ఎన్నో కష్టాలు అనుభవించింది. తన కుటుంబం అంతా ఆమెను దుబాయ్‌కు తీసుకెళ్లి టార్చర్‌ చేసింది. తిండి కూడా పెట్టకుండా వాళ్లు నరకం చూపించారు. తన బంగారం, డబ్బులు అంతా వాడుకున్నారు. ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నా కూడా ఏనాడూ నాకు ఆ విషయం చెప్పలేదు. నాకే అనుమానం వచ్చి ఆరా తీ​యడంతో ఒక్కొక్కటిగా అన్నీ బయటపడ్డాయి. నా చేతుల మీదుగా ఎంతోమంది పెళ్లిళ్లు చేశాను, అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ నా కూతురికే ఇలా జరిగిందని మధనపడ్డాను. అయినా తప్పు చేయనప్పుడు మనం తలదించాల్సిన పనిలేదు. తనిప్పుడు డిప్రెషన్‌ నుంచి బయటపడింది. విడాకులు తీసుకుని ఐదేళ్ల పిల్లాడిని పోషిస్తూ మనోధైర్యంతో ముందుకెళ్తోంది' అని చెప్పుకొచ్చింది సనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement