‘ది లెగసీ ఆఫ్ ఇండియన్ వీవ్’ప్రదర్శనకి అతిథిగా ప్రణీత! | Actress Pranitha Guest As The Legacy of Indian View Exhibition | Sakshi
Sakshi News home page

‘ది లెగసీ ఆఫ్ ఇండియన్ వీవ్’ప్రదర్శనకి అతిథిగా ప్రణీత!

Dec 19 2021 6:46 PM | Updated on Dec 19 2021 7:22 PM

Actress Pranitha Guest As The Legacy of Indian View Exhibition - Sakshi

ప్ర‌ముఖ డిజైన‌ర్ దీప్తి గ‌ణేష్ ఆధ్వ‌ర్యంలో మద్రాస్ బ్రైడల్‌ ఫ్యాషన్ వీక్‌లో 'ది లెగ‌సీ ఆఫ్ ఇండియ‌న్ వీవ్' పేరుతో రూపొందించిన డిజైన‌ర్ దుస్తుల‌ను ప్ర‌ద‌ర్శన ఈ నెల 26న చెన్నైలో నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలో అత్తారింటికి దారేది సినిమా ఫేం ప్ర‌ణీత ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబించేలా, స‌రికొత్త‌దనాన్ని జోడించి రూపొందించిన విభిన్న రీతుల‌తో కూడిన డిజైన్ల‌ను షోస్టాప‌ర్‌గా నిలిచి మిగిలిన మోడ‌ల్స్‌తో క‌లిసి ప్ర‌ద‌ర్శించనున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో దీప్తి గ‌ణేష్ మాట్లాడుతూ.. ‘సంప్ర‌దాయ చేనేత కార్మికులు చేతితో రూపొందించిన వాటిని నా డిజైన్ల‌కు ప్ర‌త్యేకంగా ఉప‌యోగిస్తున్నాను. వాటికి క్లాసిక్ లుక్స్ తీసుకొచ్చి నేటి త‌రానికి, కొత్త‌ద‌నానికి స్వాగ‌తం ప‌లుకుతూ రూపొందిస్తున్నాను. నేటి యువ‌త ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా నా డిజైన్లు ప్ర‌తిబింబిస్తాయి. మారుతున్న కాలానికి, అభిరుచికి త‌గ్గ‌ట్టుగా డిజైన్ చేయ‌డం వ‌ల్ల‌నే విజ‌యాన్ని సాధించే వీలుంటుంది’అన్నారు. దీప్తి గ‌ణేష్ విషయానికొస్తే.. ఆమె ఒక ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్‌. సినీ నటులు త‌మ‌న్నా, రాశి ఖన్నా, సుమ కనకాల, రోజ, జయసుధ త‌దిత‌రులు చాలా మంది ఆమె డిజైన్‌ చేసిన దుస్తులను వాడుతారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement