'మంగళవారం' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో విషాదం | Sakshi
Sakshi News home page

Payal Rajput: క్షమించు నిన్ను బతికించుకోలేకపోయా.. బాధలో పాయల్ రాజ్‌పుత్

Published Sun, Dec 31 2023 4:13 PM

Actress Payal Rajput Pet Dog Candy Died Insta Post Viral - Sakshi

పాయల్ రాజ్‌పుత్.. ఈ పేరు గురించి తెలుగు ఆడియెన్స్‌కి కొత్తగా చెప్పాల్సిందేం లేదు. 'ఆర్ఎక్స్ 100' మూవీతో అందరూ అవాక్కయ్యేలా చేసిన ఈ బ్యూటీ.. రీసెంట్‌గా 'మంగళవారం' సినిమాతో క్రేజీ హిట్ కొట్టింది. తాజాగా ఓటీటీలో వచ్చిన ఈ చిత్రం పాయల్‌కి చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇలాంటి టైంలో ఈ బ్యూటీ ఇంట్లో విషాదం నెలకొంది.

(ఇదీ చదవండి: 2024 న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్.. మీ దగ్గర ఈ సాంగ్స్ ఉంటే రచ్చ రచ్చే!)

ఇయర్ ఎండింగ్‌లో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో విషాదం నెలకొంది. ఈమె ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క క్యాండీ చనిపోయింది. ఈ విషయాన్ని బాధతో చెప్పుకొచ్చిన పాయల్.. క్షమించు, నిన్ను బతికించుకోలేకపోయాను అని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. పెట్ డాగ్‌తో ఉన్న రోజుల్ని గుర్తుచేసుకుని పలు వీడియోల్ని షేర్ చేసింది.

'నీ హగ్స్, నీ ప్రేమని మిస్ అవుతా.. ఇంకా నువ్వు నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తోంది.. నిన్ను ఎంతగానో ప్రేమించా.. ఇకపై నా జీవితాంతం మిస్ అవుతూనే ఉంటా.. ప్రేమ అంటే ఏంటో తెలిసేలా చేశావ్.. నువ్వెక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి' అని హీరోయిన్ పాయల్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. దీనిపై ఈమె బాయ్‌ఫ్రెండ్‌తో పాటు పలువురు స్పందిస్తున్నారు. పాయల్ కెరీర్ విషయానికొస్తే 'మంగళవారం' సినిమాతో సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. దీంతో ఈ బ్యూటీకి మరిన్ని అవకాశాలు రావడం గ్యారంటీ అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement