Anjali: త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న అంజలి..!

Actress Anjali Going Marry upcoming days goes viral - Sakshi

నటి అంజలి పరిచయం అక్కర్లేని పేరు. అటు టాలీవుడ్‌.. ఇటు కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇటీవల ఆమె సినిమాలు చేయకపోయినా.. వెబ్‌ సిరీస్‌ ఝాన్సీతో ప్రేక్షకులను అలరించింది. ఈ వెబ్‌ సిరీస్‌ డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇదిలా ఉండగా మరోసారి అంజలి పెళ్లి రూమర్స్ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. 

కాాగా.. గతంలో ఆమె ఓ డైరెక్టర్‌ను పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిని కొట్టిపారేసింది అంజలి. కానీ తాజాగా మరోసారి వార్తలు గుప్పుమనడంతో అతను ఎవరా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. టాలీవుడ్‌లో మహేష్ బాబు-వెంకటేష్‌ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలో వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా అరెంజ్‌డ్‌ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె తల్లిదండ్రులు చూసిన అబ్బాయినే పెళ్లాడబోతోందని సమాచారం. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అంజలి తల్లిదండ్రులు యుఎస్‌లో ఉన్నారు. గతంలో పలుసార్లు పెళ్లి వార్తలొచ్చినప్పటికీ మరోసారి పెళ్లి చేసుకోబోతోందని తెలియడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ప్రస్తుతం రామ్ చరణ్ మూవీ ఆర్‌సీ15లో కీలకపాత్రలో కనిపించనున్నారు.  ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అంజలి పెళ్లి చేసుకోనుందని సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top