Serial Actor Rajkumar: చిరంజీవితో పోలికే నాకు మైనస్.. రాజ్ కుమార్ కామెంట్స్ వైరల్! | Actor VV Rajkumar Comments On Compare With Megastar Chiranjeevi - Sakshi
Sakshi News home page

Raj Kumar: అదే జరిగి ఉంటే సీరియల్స్‌లో కూడా కనిపించేవాడిని కాదు: రాజ్ కుమార్

Apr 21 2023 1:32 PM | Updated on Apr 21 2023 3:10 PM

Actor VV Rajkumar Comments On Compare With Megastar Chiranjeevi - Sakshi

సినీ ఇండస్ట్రీలో రాజ్‌ కుమార్ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు. 30 ఏళ్లుగా వెండితెరపై తనదైన నటనతో మెప్పించారు. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. టాలీవుడ్‌లో జూనియర్ చిరంజీవిగా గుర్తు పొందిన రాజ్ కుమార్ ఎన్నో సినిమాల్లో, సీరియల్స్‌లోనూ నటించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన సీరియల్స్‌లో నటిస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

రాజ్ కుమార్ మాట్లాడుతూ.. 'చిరంజీవి లాగా పోలికలు ఉండటం నా అదృష్టం. కానీ అలా ఉండటం వల్లే నేను హీరోగా సక్సెస్ కాలేక ఇక్కడే మిగిలిపోయా. నేను చిరంజీవి పోలికలతో ఉండటం చూసేవారికి గొప్పగా ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో మాత్రం అది నాకు మైనస్ పాయింట్. మెగాస్టార్ పోలికలతో ఉన్నందుకు గర్వపడతా. చిరంజీవిలా ఉంటానే కానీ.. ఆయనకు ఎక్కడా కూడా సరిపోను. ఆయనొక దిగ్గజం. నన్ను ఆయనతో పోల్చే సరికి మర్రిచెట్టు కింద కలుపు మొక్కలా అయిపోయా. తెలుగులో జూనియర్ చిరంజీవిగా ఇండస్ట్రీలో గుర్తింపు రావడంతో కన్నడ ఇండస్ట్రీకి వెళ్లిపోయా.  నేను, శ్రీకాంత్, విక్రమ్, అజిత్, ఆనంద్ ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. చిరంజీవి నన్ను తొక్కేశారన్నారు. అలా జరిగి ఉంటే నేను సీరియల్స్‌లో కూడా కనిపించేవాడిని కాదు.' అంటూ ఎమోషనలయ్యారు. 

కాగా.. ప్రస్తుతం రాజ్ కుమార్ సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు. చిరంజీవి చేతుల మీదుగా అవార్డు అందుకోవటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజ్‌ కుమార్ ప్రస్తుతం జనని, కేరాఫ్ అనసూయ వంటి సీరియల్స్‌లో నటిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement