కిడ్నాపే కదండి.. చేసేద్ధాం!

Actor Vijay Devarakonda Launched Gully Rowdy Teaser - Sakshi

‘గల్లీ రౌడీ’ టీజర్‌ను రిలీజ్‌ చేసిన విజయ్‌ దేవరకొండ

విభిన్న‌మైన చిత్రాల్లో న‌టిస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు యంగ్ హీరో సందీప్ కిష‌న్. ఇటీవ‌ల తను నటించిన `ఏ1 ఎక్స్‌ప్రెస్‌’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో ప్ర‌స్తుతం గల్లీ రౌడీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ టీజర్‌ను మరో యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ సోమవారం విడుదల చేశాడు. ఈ సందర్భంగా ట్విటర్‌లో.. ‘ఈ సినిమా మీ అందరిని నవ్విస్తోంది. సందీప్‌ కిషన్‌​, కోనవెంకట్‌, చిత్రయూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌’ అని ట్వీట్‌ చేశాడు. 

ఇక టీజర్‌ విషయానికొస్తే.. ‘బాబుని రంగంలోకి దింపు. బాబు రావాలి.. రౌడీ కావాలి అని విశాఖపట్నం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం అలరించే విధంగా ఉంది. హీరో చెప్పే ఫన్నీ డైలాగులు, కిడ్నాప్‌ సీన్‌లు మూవీపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. ఓ కిడ్నాప్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో వెన్నెల కిశోర్‌, రాజేంద్ర ప్రసాద్‌ నవ్వులు పండించనున్నారు. మరి ఈ గల్లీ రౌడీ కథేంటో తెలియాలంటే సినిమా విడుదలయ్యేంత వరకు ఆగాల్సిందే.

కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, ఎంవీవీ సినిమా క‌ల‌యిక‌లో ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.  జి. నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో త‌మిళ న‌టుడు బాబీ సింహా కీల‌క పాత్ర‌లో కనిపించనున్నారు.

చదవండి: 
అందుకు కారణం సీఎం వైఎస్‌ జగన్: కోన వెంకట్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top