నా కూతురి సూసైడ్‌కు ముందు ఆ నటుడు టార్చర్‌ పెట్టాడు: నటి తల్లి | Sakshi
Sakshi News home page

Jiah Khan: ఆత్మహత్యకు ముందు నా కూతురిని ఆ నటుడు వేధించాడు: నటి తల్లి

Published Thu, Aug 18 2022 4:14 PM

Actor Sooraj Pancholi Abused Jiah Khan Verbally and Physically, Claims Actress Mother - Sakshi

రామ్‌గోపాల్‌ వర్మ నిశ్శబ్ద్‌ సినిమాలో అమితాబ్‌ సరసన నటించడంతో బాలీవుడ్‌లో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారింది నటి జియా ఖాన్‌. 2013 జూన్‌ 3న ఆమె ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో చిత్రపరిశ్రమలో సంచలనం రేపింది. జియాఖాన్‌ ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలతో బాలీవుడ్‌ నటుడు ఆదిత్యా పంచోలి కుమారుడు సూరజ్‌ పంచోలీని పోలీసులు అరెస్ట్‌ చేయగా తర్వాత అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే ఇప్పటికీ జియాఖాన్‌ కేసులో తుదితీర్పు మాత్రం వెలువడలేదు.

తాజాగా ముంబై స్పెషల్‌ కోర్టుకు హాజరైన జియా ఖాన్‌ తల్లి రబియా ఖాన్‌ తన కూతురు ఆ‍త్మహత్యకు ముందు సూరజ్‌ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ వాంగ్మూలమిచ్చింది. 'జియా.. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా నిలదొక్కుకుంటున్న సమయంలో సూరజ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ద్వారా తనను పరిచయం చేసుకుని, ఆమెను కలిసేందుకు ప్రయత్నించాడు. కొంత భయం, మరికొంత అయిష్టంగానే 2012 సెప్టెంబర్‌లో తొలిసారిగా జియా అతడిని కలిసింది. అప్పుడు వాళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలు పంపింది. కానీ కేవలం ఫ్రెండ్స్‌ అనే చెప్పింది. ఆ తర్వాత సూరజ్‌ నెమ్మదిగా జియాను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆమె ఎప్పుడేం చేయాలనేది కూడా తనే డిసైడ్‌ చేసేవాడు.


జియా ఖాన్‌ తల్లి రబియా ఖాన్‌

2012 అక్టోబర్‌లో వాళ్లిద్దరూ ఒకరింట్లో మరొకరు కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఆ తర్వాతి నెలలో నేను లండన్‌కు వెళ్లినప్పుడు నా కూతురు చాలా సంతోషంగా కనిపించింది. క్రిస్‌మస్‌ పండగ జరుపుకునేందుకు, తిరిగి సినిమాల్లో నటించేందుకు ముంబై వస్తానంది, కానీ అలా జరగలేదు.  డిసెంబర్‌ 24న నాకు సూరజ్‌ నాకు మెసేజ్‌ చేశాడు. జియాఖాన్‌ మీద కోప్పడ్డాడనని, దయచేసి తనను క్షమించి ఒక్క ఛాన్స్‌ ఇవ్వమని అడుగుతూ మెసేజ్‌ చేశాడు. వాళ్లిద్దరూ ఏదో పెద్ద గొడవే పెట్టుకున్నారని అప్పుడర్థమైంది. అయితే జియా అతడిని క్షమించేసింది. అనంతరం వాళ్లిద్దరూ కలిసి గోవాకు వెళ్లారు. కానీ ఓరోజు నా కూతురు నాకు ఫోన్‌ చేసి తనకక్కడ ఉండాలని లేదని, ఆ ప్రాంతమే తనకు అదోలా ఉందని చెప్పింది. కారణం.. గోవాలో నా కూతురి ముందే సూరజ్‌ మిగతా అమ్మాయిలతో ఫ్లర్ట్‌ చేసేవాడు. 

2013, ఫిబ్రవరి 14న జియా లండన్‌ వచ్చేసింది. అప్పుడు తనను కలిసినప్పుడు ఏదో పొగొట్టుకున్నదానిలా దీనంగా కనిపించింది. ఏమైందని అడిగితే సూరజ్‌ తనను శారీరకంగా హింసించడమే కాకుండా, అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని, చాలా చెత్త చెత్త పేర్లతో పిలుస్తూ టార్చర్‌ చేస్తున్నాడని తన దగ్గర వాపోయింది' అని చెప్పుకొచ్చింది రబియా ఖాన్‌. కాగా ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారణ జరుపుతోంది.

చదవండి: కార్తికేయ 2 ఈ ఓటీటీలోకే రాబోతోంది!
చేతకానితనంగా చూస్తున్నారా.. బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై హీరో రియాక్షన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement