
‘ప్రేమదేశం’ (1996) ఫేమ్ అబ్బాస్ గుర్తుండే ఉంటారు. 1990–2015 మధ్య కాలంలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించుకున్న అబ్బాస్ వెండితెరపై కనిపించి దాదాపు పదేళ్లయింది. 2015లో వచ్చిన ‘పచ్చకాలం’ అనే మలయాళ సినిమా తర్వాత అబ్బాస్ మరో సినిమాలో నటించలేదు. కాగా అబ్బాస్ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. నటుడు– సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా తమిళంలో ఓ సినిమా రానుంది. నూతన దర్శకుడు మరియరాజా ఇళంచెళియన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అబ్బాస్ ఓ లీడ్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. శ్రీ గౌరి ప్రియ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా, జయవర్ధనన్ నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో పదేళ్ల తర్వాత అబ్బాస్ యాక్టర్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే 2014లో వచ్చిన ‘అలా జరిగింది ఒక రోజు’ సినిమా తర్వాత అబ్బాస్ మరో తెలుగు సినిమా చేయని సంగతి తెలిసిందే.