మళ్లీ పెళ్లి చేసుకోవడం కష్టమే: ఆమిర్‌ ఖాన్ | Aamir Khan Opens Up About The Idea Of Remarriage After Separation From Kiran Rao | Sakshi
Sakshi News home page

మళ్లీ పెళ్లి చేసుకోవడం కష్టమే: ఆమిర్‌ ఖాన్

Aug 27 2024 12:02 AM | Updated on Aug 27 2024 12:02 AM

Aamir Khan Opens Up About The Idea Of Remarriage After Separation From Kiran Rao

‘‘ప్రస్తుతం నా వయసు 59 ఏళ్లు. ఈ ఏజ్‌లో మళ్లీ పెళ్లి చేసుకోవడమంటే కష్టమే. ఎందుకంటే ఇప్పుడు నాకంటూ ఎన్నో బాధ్యతలు ఉన్నాయి’’అన్నారు హీరో ఆమిర్‌ ఖాన్‌. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్న ఆమిర్‌ ఖాన్‌ తాజాగా నటి రియా చక్రవర్తి నిర్వహిస్తున్న ఓ టీవీ షోలో పాల్గొన్నారు. వివాహ బంధం సక్సెస్‌ కావాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నకు ఆమిర్‌ ఖాన్‌ బదులిస్తూ..‘‘ఒక బంధం సక్సెస్‌ లేదా ఫెయిల్యూర్‌ అనేది ఇద్దరు వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. వివాహ బంధం విషయంలో నేను రెండుసార్లు ఫెయిల్‌ అయ్యాను. అందుకే పెళ్లి విషయంలో నా సూచనలు తీసుకోకపోవడం మంచిది.

నన్ను నేను మరింత బెటర్‌గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. అలాగని నాకు ఒంటరిగా జీవించడం ఇష్టం ఉండదు. నాకంటూ ఒక భాగస్వామి ఉండాలని కోరుకుంటా. నా మాజీ సతీమణులు రీనా దత్తా, కిరణ్‌ రావులతో ఇప్పటికీ నాకెంతో మంచి అనుబంధం ఉంది. నా దృష్టిలో  మేమంతా ఒకే కుటుంబం’’ అన్నారు. ‘మీకు మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా?’ అనే ప్రశ్నకు ఆమిర్‌ ఖాన్‌ స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం నా వయసు 59 ఏళ్లు. ఈ ఏజ్‌లో మళ్లీ పెళ్లి చేసుకోవడమంటే కష్టంగా ఉంటుంది.

ఎందుకంటే ఇప్పుడు నాకంటూ ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. నా కుటుంబం, పిల్లలు, తోబుట్టువులు.. ఇలా చాలామందితో ఆప్యాయంగా కలిసిమెలిసి ఉంటున్నాను. అందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఆమిర్‌ఖాన్  తెలిపారు. కాగా ఆమిర్‌ ఖాన్‌–రీనా దత్తా 2002లో, ఆమిర్‌– కిరణ్‌రావు 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement