The 50: అరకోటి ప్రైజ్‌మనీ.. విన్నర్‌కు కాదు, అతడి అభిమానికి! | Shiv Thakre Wins The 50 Reality Show, Fan Seetharam Prahlad Aghav Bags ₹50 Lakh Prize Money, Check Post Inside | Sakshi
Sakshi News home page

ద 50 షో విజేతగా శివ్‌ ఠాక్రే.. రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ఎవరికంటే?

Mar 23 2026 9:20 AM | Updated on Mar 23 2026 10:22 AM

The 50 Show Winner Shiv Thackeray, his fan won rs 50 lakh prize money

ద 50 రియాలిటీ షోకి శుభం కార్డు పడింది. 50 మంది సెలబ్రిటీలు పాల్గొన్న ఈ షో మార్చి 22న విజయవంతంగా ముగిసింది. ఫైజల్‌ షైక్‌, కృష్ణ ష్రాఫ్‌, రజత్‌ దలాల్‌లను వెనక్కు నెడుతూ శివ్‌ ఠాక్రే విజేతగా నిల్చాడు. అతడికి ద 50 ట్రోఫీ అయితే దక్కింది. కానీ ప్రైజ్‌మనీ మాత్రం కాదు! అదే ఈ షో స్పెషాలిటీ.. కంటెస్టెంట్‌కు బదులుగా అతడి అభిమాని అరకోటి గెల్చుకునే అవకాశం ఉంటుంది. అలా శివ్‌ ఠాక్రే టైటిల్‌ గెలిస్తే అతడి అభిమాని సీతారామ్‌ ప్రహ్లాద్‌ అఘవ్‌ రూ.50 లక్షల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు.

ఫినాలేలో ఏం జరిగిందంటే.. 
50 మంది కంటెస్టెంట్లతో ద 50 షో మొదలైంది. ఫైనల్స్‌కు వచ్చేసరికి ఐదుగురు మాత్రమే మిగిలారు. వారే రజత్‌ దలాల్‌, శివ్‌ ఠాక్రే, కృష్ణ ష్రాఫ్‌, కాక (రవీందర్‌ సింగ్‌), ఫైజల్‌ షైక్‌. మీలో ఒకర్ని మీరే ఎలిమినేట్‌ చేయాలని ద లయన్‌(షోలో బాస్‌) చెప్పగా.. శివ్‌, కృష్ణ, కాక.. రజత్‌ను ఎలిమినేట్‌ చేశారు. మిగిలిన నలుగురికి నాలుగు రకాల టాస్కులు అప్పగించారు. వీటన్నింటిని దాటుకుని శివ్‌ ఠాక్రే గెలిచి సత్తా చూపించాడు. ఫైజల్‌ షైక్‌ ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచాడు. 

అభిమానికి రూ.50 లక్షలు
నిజానికి ప్రిన్స్‌ నరూలా త్యాగం చేసిన టికెట్‌ టు ఫినాలేతోనే  శివ్‌ ఠాక్రే ఫైనల్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ఆ ఒక్క అవకాశాన్ని వాడుకుని ఇప్పుడేకంగా ట్రోఫీ గెలవడం విశేషం. రూ.50 లక్షలు గెలిచిన శివ్‌ ఠాక్రే అభిమాని సీతారాం మాట్లాడుతూ.. నేను, నా కుటుంబం పొలం పని చేసుకుంటాం. ఈ ప్రైజ్‌మనీ గెలవడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇదంతా ఒక మోసమేమో అనుకునేవాడిని. జరుగుతుందంతా చూస్తుంటే ఒక కలలా ఉంది. నా తల్లిదండ్రులకు మంచి ఇల్లు, కారు కొనివ్వాలనుకున్నాను, ఈ డబ్బుతో అదే చేస్తాను అని పేర్కొన్నాడు. కాగా శివ్‌ ఠాక్రే.. గతంలో మరాఠి బిగ్‌బాస్‌ రెండో సీజన్‌ విజేతగా నిలవగా హిందీ బిగ్‌బాస్‌ 16వ సీజన్‌లో ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచాడు.
 

 

 

చదవండి: మంచు లక్ష్మి ఇంట్లో వేడుక.. మోహన్‌బాబు ఆశీర్వాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement