
30 Weds 21 Web Series Season 2 Teaser Released: 2021లో యూట్యూబ్‌లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ 30 వెడ్స్ 21. 30 ఏళ్ల బ్యాచిలర్‌కు, 21 ఏళ్ల అమ్మాయితో వివాహం అనే ఫ్రెష్ కాన్సెప్ట్‌తో వచ్చింది ఈ సిరీస్. తొమిదేళ్ల ఏజ్ గ్యాప్‌తో పెళ్లి చేసుకున్న ఇద్దరి మధ్య ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయో చూపించి ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో దంపతులుగా నటించిన చైతన్య, అనన్య జోడీ నెటిజన్లను బాగా అట్రాక్ట్ చేసింది. ఈ సిరీస్ ఎంతో హిట్ కావడంతో దీనికి కొనసాగింపుగా రెండో సీజన్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సిరీస్‌కు రెండో సీజన్ ఫస్ట్ లుక్‌ను ప్రకటించిన మేకర్స్ సోమవారం 30 వెడ్స్ 21 రెండో సీజన్ టీజర్‌ను విడుదల చేశారు.
ఇక మనిద్దరి మధ్య ఎలాంటి సమస్యలు రావు అంటూ పృథ్వీ చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. అనేక భావోద్వేగాల మధ్య కలిసిన మేఘన, పృథ్వీలు జంటగా ప్రేమ పక్షుల్లా విహరించడం, అనుభూతి చెందడం టీజర్లో చూపించారు. 'నాన్న బుజాల మీదెక్కి చూసే ప్రపంచానికి, మన కాళ్ల మీద నిలబడి చూసే ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది' అనే డైలాగ్ ఆకట్టుకుంది. ఈ వెబ్ సిరీస్‌కు అసమర్థుడు, మనోజ్ పీ కథను అందించగా, పృథ్వీ వనం దర్శకత్వం వహించారు.