కొల్చారం(నర్సాపూర్): జిల్లాలోని ఒక్క మనోహరాబాద్ మండలాన్ని మాత్రమే కరువు మండలంగా ప్రభుత్వం ప్రకటించిందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. శనివారం మండలంలోని చిన్నఘనాపురంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, చైర్మన్ నాగయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని కౌడిపల్లి, నర్సాపూర్, చిలప్‌చెడ్ మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ కరువు మండలాల జాబితాలు చేర్చకపోవటం ఏమిటని ప్రశ్నించారు. కరువు మండలాలుగా ప్రకటించడం వల్ల ఆయా మండలాల్లోని రైతులకు ఉచితంగా విత్తనాలు, పశుగ్రాసం, ఉపాధి హామీ పనులు, తాగునీటికి ప్రత్యేక నిధులు వస్తాయన్నారు. రబీ సీజన్‌లో క్రాఫ్ హాలిడే పాటించాలని చెబుతున్నా ప్రభుత్వం, వారి జీవనోపాధికి ఎకరాకు రూ.30 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్‌చారి, మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్, మాజీ సీడీసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ రాజాగౌడ్, సొసైటీ డైరెక్టర్లు బాగారెడ్డి, మల్లేశం, సీఈఓ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి


