రైతు గుండె చెరువు | - | Sakshi
Sakshi News home page

రైతు గుండె చెరువు

Jul 27 2026 7:26 AM | Updated on Jul 27 2026 7:26 AM

హత్నూర(సంగారెడ్డి): కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో చినుకు జాడ లేకుండా పోయింది. ఏటా ఈ సమయానికి పచ్చని పైర్లతో కనువిందు చేసే సాగు భూములు ఎడారిని తలపిస్తున్నాయి. వర్షాలు లేక చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. అయితే బోర్ల కింద మాత్రం రైతులు జోరుగా వరి నాట్లు వేస్తున్నారు. అధికారులు వద్దంటున్నా.. రైతన్నలు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. మండలంలోని 38 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 250 వరకు చెరువు, కుంటలు ఉన్నాయి. వర్షాలు కురవకపోవడంతో ఏ ఒక్క చెరువు కుంటల్లో చుక్క నీరు చేరలేదు. అయినప్పటికీ రైతులు మాత్రం వరి నాట్లు వేస్తున్నారు. వరి నాట్లు వేసిన తర్వాత భూగర్భజలాలు అడుగంటి బోర్ల నుంచి నీరు రాకపోతే వేసిన పంటలు ఎండిపోయే అవకాశం ఉంది. పెట్టిన పెట్టుబడులు సైతం నష్టపోయే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కమ్ముకున్న కరువు

వెలవెలబోతున్న నీటి వనరులు

బోర్లను నమ్ముకుని వరి నాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement