నారాయణఖేడ్: పర్యాటక ప్రాంతంగా బోరంచ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. నల్లపోచమ్మ, సంగమేశ్వర ఆలయాల సమీపంలో ఉన్న మంజీరా నదిలో భక్తుల సౌకర్యార్థం మాఘ స్నానాల కోసం మెట్ల నిర్మాణ పనులను ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. టూరిజంలో భాగంగా బోటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. బోరంచ, సంగమేశ్వర ఆలయాలను మరిన్ని నిధులతో ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక అభివృద్ధితో ప్రాంతం మరింత అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజిరెడ్డి, నాయకులు దిగంబర్‌రెడ్డి, బీరప్ప, సిద్దారెడ్డి, శేరి రాజు పాల్గొన్నారు. అనంతరం తుమ్నూర్, ముగ్దుంపూర్ గ్రామాల్లో రూ. 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, మురుగు కాల్వ నిర్మాణం పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
ఎమ్మెల్యే సంజీవరెడ్డి


