సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నీట్ పరీక్షా పత్రాల లీకేజీని నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు, రాహుల్‌గాంధీ చేసిన పోరాట ఫలితంగానే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఐబీ చౌరస్తా నుంచి పాతబస్టాండ్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈసందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మోదీ నివాసం ఎదుట రాహుల్‌గాంధీ ధర్నా చేసిన తర్వాతే ఈ ఉద్యమం మరింత ఉధృతమైందన్నారు. మోదీ పాలన 14 సంవత్సరాలు పూర్తయిందని బీజేపీ నాయకులు మిఠాయిలు పంచుకున్నారని.. నీట్ పరీక్ష పత్రం లీక్ కావడంతో 14 మంది మెరిట్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి


