మెదక్‌జోన్: జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ‘దోస్త్’ ద్వారా మరోసారి ప్రవేశాలకు అవకాశం కల్పిస్తూ షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే మూడు విడతలుగా అవకాశం కల్పించారు. చివరగా ఈనెల 26 వరకు పొడిగించారు. ఈనెల 27వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 30న సీట్ల కేటాయింపు ఉంటుంది. కాలేజీల్లో రిపోర్టింగ్‌కు ఆగస్టు 1 వరకు ఛాన్స్ ఇచ్చారు. కాగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రారంభమై నెలన్నర అవుతున్నా, ఇప్పటివరకు కేవలం 35 శాతం సీట్టు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 75శాతం ఖాళీ గానే ఉన్నాయి. జిల్లాలో మెదక్, రామాయంపేట, నర్సాపూర్, కౌడిపల్లి మండలాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వాటిలో 2,160 సీట్లు ఉండగా, ఇప్పటివరకు కేవలం 749 సీట్లు మాత్రమే భర్తీ కాగా, ఇంకా 1,411 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీలో చేరాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు.
● మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆయా కోర్సుల్లో మొత్తం సీట్లు 1,200 ఉండగా, 620 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 580 ఖాళీగా ఉన్నాయి.
● రామాయంపేట డిగ్రీ కళాశాలలో 240 సీట్లు ఉండగా, 46 సీట్లు భర్తీ అయ్యాయి. 194 ఖాళీగా ఉన్నాయి.
● నర్సాపూర్ కళాశాలలో 480 సీట్లు ఉండగా, 69 సీట్లు భర్తీ అయ్యాయి. 411 ఖాళీగా ఉన్నాయి.
● కౌడిపల్లి డిగ్రీ కళాశాలలో 240 సీట్లు ఉండగా, 14 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 226 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
ఈ నెల 26 వరకు అవకాశం
జిల్లాలో 1,411 సీట్లు ఖాళీ


