మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్‌లో సోమవారం హెల్ప్‌డెస్క్ ద్వారా నిర్వహించిన ప్రజావాణికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ తమ సమస్యలపై 85 అర్జీలు అందజేశారు. సంగారెడ్డిలో జరిగిన ఉమ్మడి జిల్లా సమావేశానికి కలెక్టర్‌తో పాటు జిల్లాస్థాయి అధికారులంతా తరలివెళ్లారు. దీంతో కలెక్టరేట్‌లో హెల్ప్‌డెస్క్ ద్వారా వినతులు స్వీకరించారు. వీటిని కలెక్టర్ అనుమతితో సంబంధిత శాఖలకు అందజేయనున్నట్లు సిబ్బంది తెలిపారు. ఈసందర్భంగా జిల్లా కేంద్రంలోని డబుల్ బెడ్రూంలలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పలువురు వినతిపత్రం సమర్పించారు. కనీస వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.


