ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే ప్రతికూల పరిస్థితులను ముందస్తు ప్రణాళికతో సమర్థవంతంగా ఎదుర్కొవాలి. ఇందుకోసం సంబంధితశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ఎల్‌నినో అనేది ప్రకృతి విపత్తు అని దీన్ని ఎవరూ ఆపలేరు. దీని ప్రభావంతో జరిగే నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి. వరి వంటి నీటి అవసరాలు అధికంగా ఉన్న పంటలకు బదులుగా ఆయిల్‌పామ్ వంటి ఆరుతడి పంటల విస్తీర్ణం పెంచేందుకు రైతుల్లో చైతన్యం నింపాలి. ఇందుకోసం సోషల్ మీడియా రీల్స్, కళాజాతలు, నాటక ప్రదర్శనలను వినియోగించాలి. తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. భూగర్భజలాలు పెంచేందుకు ఇంకుడుగుంతలు తవ్వుకునేలా ప్రజలను చైతన్యం చేయాలి.
– వివేక్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి


