న్యూస్‌రీల్
అథ్లెటిక్స్ సందడి
మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని శాయ్ స్టేడియంలో శనివారం 4వ రాష్ట్రస్థాయి అండర్ 14, 16, 18, 20 బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నెహ్రూ యువకేంద్రం జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు పేరాల చంద్రశేఖర్‌రావు పోటీలను ప్రారంభించి మాట్లాడారు. స్టేడియంలో అన్ని వసతులు కల్పించి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ రఘునందన్‌రావుతో మాట్లాడి ఖేలో ఇండియా నిధులు సైతం తీసుకొస్తామన్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావుతో కలిసి అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక మాట్లాడుతూ.. స్టేడియం అభివృద్ధికి తనవంతు బాధ్యతగా కృషి చేస్తానన్నారు. కాగా, పోటీలకు వివిధ జిల్లాల నుంచి సుమారు వెయ్యి మంది బాలబాలికలు హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అతిథులు ప్రశంసాపత్రాలతో పాటు మెడల్స్ ప్రధానం చేశారు.


