గాంధీభవన్‌ చేరిన శివ్వంపేట పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

గాంధీభవన్‌ చేరిన శివ్వంపేట పంచాయితీ

Jul 19 2026 6:47 AM | Updated on Jul 19 2026 6:47 AM

శివ్వంపేట(నర్సాపూర్‌): శివ్వంపేట మండల కాంగ్రెస్‌ పంచాయితీ గాంధీభవన్‌ చేరింది. నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి వైఖరి నిరసిస్తూ శనివారం మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్‌ ఆధ్వర్యంలో నాయకులు పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా సుదర్శన్‌గౌడ్‌ మాట్లాడుతూ.. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన నా యకులు, కార్యకర్తలను నియోజకవర్గ ఇన్‌చార్జి రాజిరెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో లబ్ధిపొంది పార్టీ మారిన వారితో కుమ్మకై గ్రామాల్లో పర్యటిస్తున్నాడని తెలిపారు. పార్టీకి నష్టం చేకూరుస్తున్న ఇన్‌చార్జిని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, నర్సింలు, శ్రీనివాస్‌గౌడ్‌, వెంకట్‌రెడ్డి, అశోక్‌, తిరుపతిరాథోడ్‌, అంజిరెడ్డి, ప్రహ్లాద్‌చారి, పాండ్యా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

హోటళ్లపై దాడులు..

జరిమానాలు

రామాయంపేట(మెదక్‌): నాసిరకం పదార్థాలు విక్రయిస్తున్న హోటళ్లు, బేకరీలపై మున్సిపల్‌ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈనెలలో మూడుసార్లు ఆకస్మిక తనిఖీలు ని ర్వహించి, జరిమానాలు విధించారు. తాజాగా శనివారం సానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వనిత ఆధ్వర్యంలో పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహించి నాసిరకం పదార్థాలను గుర్తించారు. ఓ టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకులకు రూ. 10 వేలు, రెండు హోటళ్లకు రూ. 5 వేల చొప్పున జరిమానా విధించారు. హోటళ్లలో పరిశుభ్రత పాటించకపోవడం, ప్లాస్టిక్‌ వినియోగం, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేసినందుకు జరినామానా విధించారు.

వర్షం.. పంటలకు జీవం

టేక్మాల్‌(మెదక్‌): మండలంలోని ఆయా గ్రా మాల్లో శనివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం పంటలకు జీవం పోసింది. గత 15 రోజులుగా వర్షాలు లేక ఎండలు తీవ్రస్థాయికి చేరి మొలకలు ఎండుముఖం పట్టాయి. పత్తి, కంది, పెసర, మినుము పంటలకు వర్షం ఊపిరి పోసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. మరింత వర్షం కురిసి చెరువు, కుంటలను నింపాలని వరుణ దేవుడిని వేడుకుంటున్నారు.

పంటల ఎంపికలో

జాగ్రత్తలు అవసరం

నర్సాపూర్‌: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వాతావరణశాఖ సూచనలు పాటిస్తూ పంటల ఎంపికలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్‌ సూచించారు. శనివారం స్థానిక రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యా మ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు. పలు ప్రాంతాల్లో వర్షాపాతం తగ్గుతుందని, అధిక ఉష్ణోగ్రతలు నమోద వుతున్నాయన్నారు. రైతులు నీటి లభ్యతను బట్టి పంటల సాగు చేయాలని, తక్కువ నీరు అవసరమయ్యే కంది, పెసర, జొన్న తదితర పంటలు సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ శ్రీనివాస్‌రావు, ఏడీఏ సంధ్యారాణి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి, మండల వ్యవసాయాధి కారి దీపిక, మున్సిపల్‌ కమిషనర్‌ సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఖైదీల హక్కులు పరిరక్షించాలి

సంగారెడ్డి టౌన్‌: ఖైదీల సంక్షేమ హక్కులు పరిరక్షించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవా ని చంద్ర అన్నారు. శనివారం కందిలోని సెంట్రల్‌ జైలును జైలు సూపరింటెండెంట్‌ సంజయ్‌ కుమార్‌తో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖైదీల హక్కుల పరిరక్షణకు అవసరమైన న్యాయ సేవలు అంది ంచడం న్యాయ సేవాధికారి సంస్థ లక్ష్యం అని, ఖైదీలతో వారికి సమయానికి ములాఖాత్‌లు అందించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement