నత్తనడకన అమృత్ 2.0
●నిర్లక్ష్యంతో నీరుగారుతున్న పథకం ●కొనసా..గుతున్న పనులు
తాగేదెన్నడో?
‘అమృత్ జల్ 2.0’ పథకం నీరుగారుతోంది. నర్సాపూర్ మున్సిపాలిటీ ప్రజలనీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్రం నిధులు మంజూరు చేయగా, పనులు నత్తనడకన సా..గుతున్నాయి. దీనికి ఆయాశాఖల అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపమే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. సుమారు రెండేళ్ల క్రితం కేంద్రం రూ. 11.90 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో రెండు భారీ నీటి ట్యాంకులు నిర్మించడంతో పాటు పట్టణంలో పైపులైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. – నర్సాపూర్


