ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. సోమవారం పార్టీ సభ్యత్వ నియోజకవర్గ ఇన్‌చార్జి నరహరితో కలిసి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ చేపట్టిన పలు ప్రాజెక్టులకు మరమ్మతులు చేయకుండా కుటిల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ను ప్రజల నుంచి దూరం చేయడం సీఎంకు సాధ్యం కాదన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ను నడిపించి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కాగా, హల్దీ ప్రాజెక్ట్ కింద ఉన్న రైతుల సంక్షేమం కోసం తమ పార్టీ ఆధ్వర్యంలో త్వరలోనే ‘హల్దీ బచావో’ కార్యక్రమం చేపడతామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. షాబాద్ బాధితులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. అనంతరం నరహరి మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వాన్ని సకాలంలో పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు దేవేందర్‌రెడ్డి, చంద్రాగౌడ్, శేఖర్, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.


