అల్లాదుర్గం(మెదక్): ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతమయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై శనివారం నిర్వహించి బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తల సమావేశానికి మంత్రి దామోదర హాజరై మాట్లాడారు. ఎమ్యూరేషన్ ఫారాలు సక్రమంగా పూరించేందుకు ఓటర్లకు సహకారం అందించాలన్నారు. రోజు వారి లక్ష్యాలను నిర్దేశించుకుని, బీఎల్‌ఓల సహకారంతో ఎలాంటి తప్పులు చేకుండా ఫారాలు పూర్తి చేయించాలని సూచించారు. ప్రతీ గ్రామంలో ఒక్క ఓటు కూడా రద్దు కాకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేషారెడ్డి, నాయకులు సుభాశ్‌రావ్, బల్‌రాం, నర్సింహారెడ్డి, గోపాల్‌రెడ్డి, వీరప్ప, శ్రీనివాస్ రెడ్డి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ


